ఆ మాట అన్నందుకు నన్ను నిందించారు : కోట శ్రీనివాస రావు

Wednesday, May 2nd, 2018, 08:15:33 PM IST


విలక్షణ సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు గురించి తెలుగు వారికి పరిచయం అవసరం లేదు. కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, సెంటిమెంటల్ ఇలా చెప్పుకుంటూ పోతే కోట పోషించని పాత్ర లేదనే చెప్పాలి. అయితే కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించే కోటను ఇండస్ట్రీలోని కొందరు మాత్రంతప్పుపడుతుంటారు . అయితే ఒక విషయమై గత కొన్నేళ్ల క్రితం విషయం ఒకటి చెప్పుకొచ్చారు కోట. ఆయన ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ఇప్పుడు తెలుగు నటులకు తెలుగు సినిమాల్లో అవకాశాలు సరిగా ఇవ్వడం లేదని ఉద్యమాలు, నిరసనలు చేస్తున్నారు. నిజానికి తాను కొన్ని సంవత్సరాల క్రితమే ఈ విషయాన్నీ లేవనెత్తానని అన్నారు.

తెలుగు నటులు చాలా మంది అన్ని విభాగాల్లో వున్నారు. అటువంటి వారిని ప్రోత్సహిచడం తెలుగు వారీగా మన బాధ్యత అని అన్నానన్నారు. అయితే అప్పట్లో చాలా మంది నిర్మాతలు, దర్శకులు నా వ్యాఖ్యలను తప్పుపట్టారని, మరి కొందరైతే కోట కేవలం తెలుగు నటులకు మద్దతు ఇస్తున్నారు, అంటే పరాయి రాష్ట్రాల నటులు ట్లేగ చిత్రాల్లో నటించకూడదా అంటూ విమర్శించారని చెప్పుకొచ్చారు. అయితే తాను అందరూ పరభాషా నటులను అలా అనలేదని, వారిలో కూడా అద్భుతమైన నటులు వున్నారని, ఉదాహరణకు నసీరుద్దీన్ షా, నన పాటేకర్ లాంటి వాళ్ళ నటనకు ఎవరు సాటిరారని అన్నారు. అవకాశం వస్తే వారికింద నౌకరుగా కూడా వేషం వేస్తా అని అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments