సెల్ ఫోన్ తో ఆటలొద్దు అన్నందుకు….?

Monday, July 23rd, 2018, 12:21:32 PM IST

ప్రస్తుతం సెల్ ఫోన్ మరియు ఇంటర్నెట్ సామాన్యుడికి అందుబాటులోకి రావడంతో అందరూ కూడా సెల్ వినియోగం మరింత పెంచారు. ఇక చిన్న, పెద్ద అనే వయోబేధం లేకుండా చాలా మంది సెల్ ను వినియోగిస్తున్నారు. ఇప్పుడు సెల్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కొందరు తల్లి తండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుండి సెల్ అలవాటు చేయడంవల్లనే వారి మనసు చెడిపోతోందని, తద్వారా వారు చదువుల మీద శ్రద్ధ పెట్టక, భవిష్యత్తు కూడా పాడవుతుంది అని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం సెల్ వాడొద్దు అని అన్నందుకు తమ నిండు ప్రాణాలు సైతం బలి చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అటువంటిదే. ఇక విషయంలోకి వెళితే, మహబూబ్ నగర్లోని ఒక బాలిక సెల్ ఫోన్ తో ఆడొద్దన్నారని ఏకంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ జిల్లలో పెను సంచలనం రేపింది. నగరంలోని ఒక ప్రైవేట్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న దివ్యకు సెల్ ఫోన్ లు అన్నా, సెల్ ఫోన్ తో ఆడడం అన్నా చాలా ఇష్టం.

అయితే రోజూ స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చిన ఆమె హోమ్ వర్క్ కూడా చేయకుండా గంటల తరబడి సెల్ తో ఆడటం గమనించిన ఆమె తల్లితండ్రులు ఒక రోజు గట్టిగా మందలించారు. అలా సెల్ అతిగా వినియోగించడం మంచిది కాదని, ఇకపై చదువుమీద దృష్టి పెట్టమని గట్టిగా మందలించడంతో, నిన్న స్కూల్ నుండి తిరిగివచ్చిన దివ్య గదిలోకి వెళ్లి ఫ్యాన్ కి వురి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలోకి వెళ్లిన దివ్య ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో తలుపులు గట్టిగా బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్ కు ఉరివేసుకున్న ఆమె వేలాడుతూ కనపడింది. ఆ దుర్ఘటనను చూసిన తల్లితండ్రులు ఒక్కసారిగా కూలపడిపోయారు. అసలు తాము పెద్దగా మందలించలేదని, సెల్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని, బాగా చదువుకుని పైకివస్తే జీవితం ఆనందంగా ఉంటుందని మాత్రమే చెప్పమని, ఇంత చిన్న విషయానికి నిండు ప్రాణాన్ని తీసుకుంటుందని అనుకోలేదని వారు భోరున విలపిస్తున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments