దాసరి ‘శివరంజని’లో ఆ హీరోనే ముందు తీసుకుందానుకున్నారట!

Saturday, May 5th, 2018, 12:40:26 AM IST

దర్శక రత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఆయన విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయి దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన విగ్రహానికి పూల మాలలు వేశారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, బాల కృష్ణ, అల్లు అరవింద్‌, మురళీ మోహన్‌, సురేశ్‌ బాబు, వీవీ వినాయక్‌, సురేశ్‌ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్నారు.

తదనంతరం నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో దాసరి చాలా క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి అని, ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారని అన్నారు. కాకతాళీయమో, లేక యాదృచ్చికమో తెలియదుగాని ఆయన దర్శకత్వం వహించిన 150 వ చిత్రం పరమ వీర చక్రలో తాను హీరోగా నటించడం ఆనందంగా ఉందని అన్నారు. అలానే బాలకృష్ణ అలనాటి దాసరి సూపర్ హిట్ చిత్రం శివరంజని గురించి ఒక ఆసక్తి కరమైన విషయం చెప్పారు. నిజానికి శివరంజని చిత్రంలో తాను హీరోగా చేయవలసిందని, ఆ విషయం దాసరిగారు నాన్న ఎన్టీఆర్ గారి అడిగారని, అయితే అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు.

ప్రస్తుతం వద్దులెండి, వేరేవాళ్లను పెట్టి తీయండి అన్నారని నాటి సంగతులను చెప్పుకొచ్చారు. దాసరి సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని, దర్శకత్వమైనా, కొన్ని రకాల పాత్రల పోషణలో అయిన ఆయనకు ఆయనే సాటి అని, అందరితో త్వరగా కలిసిపోయే మనస్తత్వం ఆయనదని, తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన దాసరి ఎప్పటికి మనం గుండెల్లో పదిలంగా ఉంటారని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేసారు…..