ఈ దొంగలు ఏకంగా ఎస్ఐకే గురి పెట్టారు..

Thursday, April 12th, 2018, 05:13:48 PM IST

ఈ మధ్య కాలంలో దొంగలు కూడా ట్రెండు మార్చారు. మేము ట్రెండు ఫాలోవర్లము కాదు ట్రెండు సెట్టర్లము అంటున్నారు. తాజాగా తెలంగాణా, కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లిలో ఓ పోలీస్ అధికారి ఇంట్లో చోరీ జరిగింది. పోలిస్ ఇంట్లో దొంగతనం ఏంటా అనుకుంటున్నారా పోలిస్ అయినంత మాత్రాన దొంగతనాలు జరగవా..? నిజమే కదా అయితే తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఈ పోలిస్ అధికారి ఇంట్లోకి దొంగలు చొరబడి ఉన్నదంతా దోచుకెళ్ళారు. దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోని రూ. 47 వేల నగదు, రెండు తులాల బంగారంను అపహరించుకుపోయారు. చోరీ జరిగిన ఇళ్లు గజ్వేల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ ఆనంద్ గౌడ్ నివాసంగా గుర్తింపు. వివరాలు తెలుసుకున్న పోలిస్ బృందం త్వరలోనే దొంగలను పట్టుకొని దోచుకెళ్ళిన మొత్తాన్ని తిరిగి రాబట్టేలా చూస్తామని పేర్కొన్నారు.