నిజాంల టిఫిన్ బాక్సుతో దొంగలు ఏం చేశారంటే..!

Tuesday, September 11th, 2018, 06:56:50 PM IST

హైదరాబాద్‌ లోని నిజాం మ్యూజియంలో ఈ నెల 3వ తేదీన చోరీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకుపోలీసులు దొంగలను పట్టుకున్నారు. ఈ చోరీ కేసును దక్షిణ మండల, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కలిసి ఛేదించారు. ఇద్దరు యువకులు మహ్మద్ గౌస్ పాషా అలియాస్ ఖూనీ గౌస్, మహ్మద్ మోబీన్‌ ఈ చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు వారి నుంచి అపహరణకు గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల కోసం పోలీసులు పక్కా ప్రణాళికలతో 20 బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారు. నిజాం కాలం నాటి టిఫిన్ బాక్స్, వజ్రాలు, కెంపులు పొదిగిన కప్పు, సాసర్, స్పూన్ లను ఇద్దరు దొంగలు చోరీ చేశారు. వాటి విలువ కోట్లల్లో ఉంటుంది. వాటిని అమ్మందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు కొనలేదు. చోరీ అనంతరం ముంబై పారిపోయిన దుండగులు అక్కడ ఒక స్టార్ హోటల్లో బస చేశారు. నిజాం కాలంనాటి కోట్ల విలువైన టిఫిన్ బాక్స్ లోనే దొంగ రోజు తిండి తినడానికి ఉపయోగించినట్లు చెప్పిన పోలీసులు దొంగతనం చేయడానికి 40 రోజుల ముందు నుంచే దొంగలు రెక్కీ నిర్వహించినట్లు వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments