హరికృష్ణ అంతిమయాత్రలో దొంగతనాలు.. తెల్లారి దర్శనమిచ్చిన ఖాళీ పర్సులు!

Saturday, September 1st, 2018, 08:56:55 AM IST

ఓ వైపు తమ అభిమాన వ్యక్తి మరణించాడని కడసారి చూపుకోసం వేలాది మంది అభిమానులు తరలివస్తే సమయం సందర్భం లేకుండా దొంగలు చేతివాటం చూపించారు. బుధవారం నల్గొండ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఆయన అంతిమయాత్ర నిర్వహించగా వేలాది మంది అభిమానులు హరికృష్ణ పార్థివదేహం వెంట నడిచారు. ఈ క్రమంలో జేబు దొంగలు ఏ మాత్రం ఆలోచించకుండా గుంపులోనే వారి పనితనాన్ని చూపించుకున్నారు.

పర్సులను దొంగలించి అందులో ఉన్న డబ్బును తీసుకొని ఖాళీ పర్సులను మహాప్రస్థానం పరిసర ప్రాంతాల్లో పడేశారు. హరికృష్ణ అంత్యక్రియలు ముగిసిన తరువాత రోజు ఉదయం అవి సిబ్బందికి కనిపించాయి. పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తుండగా పర్సులు దొరకడంతో వాటికి సంబందించిన వారికి ఫోన్ చేసి ఎవరి పర్సులను వారికి ఇచ్చేశారు. డబ్బు పోయినప్పటికీ ముఖ్యమైన కార్డులు లభించడంతో మహాప్రస్థానం సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. మెహదీపట్నంలోని హరికృష్ణ ఇంటినుండి మొదలై జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు జరిగిన అంతిమ యాత్రలో వేలాదిగా నందమూరి అభిమానులు మరియు ప్రజలు, ప్రముఖులు పాల్గొన్నారు.

నేటిఏపి స్పెషల్ : టీవీల్లో అత్యధిక TRP రేటింగ్స్ అందుకున్న సినిమాలు!

  •  
  •  
  •  
  •  

Comments