దేశంలో తొలిసారి ఆ పోలీసులకు ఉరిశిక్ష!

Thursday, July 26th, 2018, 10:28:17 AM IST

కేరళలోని తిరువనంతపురం సీబీఐ కోర్టు ఊహించని తీర్పుని ఇచ్చింది. దేశంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త నిర్ణయాన్ని తెలుపడం హాట్ టాపిక్ గా మారింది. పోలీస్ కస్టడీలో ఉన్న యువకుడు మరణించినందుకు ఇద్దరి పోలీసులకు మరణశిక్షను ఖరారు చేసింది. ఇండియాలో పోలీస్ కస్టడీలో మరణించిన కేసుల విషయంలో ఎప్పుడు ఇలాంటి తీర్పు రాలేదు. అయితే 18 ఏళ్లుగా సాగిన విచారణ అనంతరం తిరువనంత పురం కోర్టు మాత్రం సంచలన తీర్పిచ్చింది.

అసలు వివరాల్లోకి వెళితే.. 2005లో ఒక దొంగతనం కేసులో కస్టడీలో ఉన్న ఉదయ్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు మరణించాడు. అప్పట్లో ఈ ఘటనపై ప్రజాసంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయగా యువకుడి తల్లి కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం కేసును సిబిఐకి అప్పగించింది. ఈ కేసులో అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ గా ఉన్న కే జీతకుమార్ అలాగే సివిల్ పోలీస్ ఆఫీసర్ ఎస్వీ శ్రీకుమార్లను ముఖ్య దోషులుగా తేల్చి ఉరితీయాలని న్యాయస్థానం నిర్ణయించింది. అలాగే రెండు లక్షల జరిమాన కూడా విధించారు. కేసులో భాగమైన మరో ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్షను విధించగా మరో నిందితుడిగా ఉన్న కేవీ సోమన్ అనే పోలీస్ అధికారి విచారణ దశలో మరణించాడు.

  •  
  •  
  •  
  •  

Comments