వీడియో : మోగ్లీ పాప సాహసం చూశారా?

Wednesday, April 4th, 2018, 07:19:49 PM IST

పిల్లలను అదుపులో పెట్టుకుంటే ప్రతి విషయంలో ఇతరులపై ఆధారపడతారు. అయితే వారికి కొన్ని పనుల్లో స్వేచ్ఛను ఇస్తే ఎంతో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అలాగని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండవద్దు. ఈ రోజుల్లో చిన్నారులు ఆటలకు చాలా దూరమవుతున్నారు అనేది వాస్తవం. కాస్త గ్యాప్ దొరికినా ట్యూషన్స్ – స్పెషల్ క్లాసులు అని ఎంతో ఒత్తిడికి గురి చేస్తారు. చదువుతో పాటు బయటప్రపంచంలో వారి రెక్కలకు స్వేచ్ఛను ఇస్తూ ఉండాలి. అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా ఓ చిన్నారి టార్జాన్ – మోగ్లీ లాంటి క్యారెక్టర్స్ ని గుర్తు చేసింది. ఓ కొబ్బరి చెట్టు ఎక్కుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొమ్మని పట్టుకొని చాలా స్పీడ్ ఎక్కడం చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. తిరువనంతపురం లో చోటు చేసుకున్న ఈ ఘటన నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.