ఈ ఆర్ట్ ఎలా చేస్తారో చూస్తే ఎలాంటి వారైనా షాక్ అవ్వాల్సిందే..!

Tuesday, January 1st, 2019, 04:00:42 PM IST

సాధారణంగా ఎవరైనా కాగితం మీదనో లేక లేక వస్తువుల మీదనో మనుషుల మీదనో బొమ్మలు గీస్తారు.కానీ ఐరోపా, స్పెయిన్ దేశంలో గెలీసియా ప్రాంతానికి చెందిన ”డేవిడ్ కెటా” అనే వ్యక్తి మాత్రం ఈ అన్ని అంశాల కంటే చాలా భిన్నంగా ఆలోచించాడు.ఇతను తీర్చిదిద్దే ఆర్ట్ ని చూస్తే మాత్రం ఒక్కొక్కరికి గుచ్చుకున్నట్టు ఉంటుంది.ఎందుకంటే ఇతను సూది,మరియు దారంతో బొమ్మలు వేస్తాడు.

ఇక్కడే మరో ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఈ సూది,దారాన్ని ఉపయోగించి బట్టల మీద బొమ్మలు వేస్తాడనుకుంటే పోరాపాటే..బట్టలు కుట్టినట్టుగా మన అరచేతి పై అతి సున్నితంగా అస్సలు ఎవ్వరు ఊహించని విధంగా మనుషుల ఆకారాలను కుట్టేస్తాడు.అప్పటికే ఎన్నో కలల్లో ఇతగాడు ప్రతిభావంతుడు.అక్కడితో ఆగకుండా మరోసారి తన బుర్రకి పని చెప్పి ఈ ఆర్ట్ ని మొదలు పెట్టాడు అంతే ఇది చూసిన ప్రతీ ఒక్కరు వామ్మో అంటున్నారు.అతను అసలు ఎలా కుట్టి ఆర్ట్స్ వేశాడో చూడాలనుకుంటున్నారా అయితే ఈ కిందున్న వీడియోని చూసెయ్యండి.