ఈ ఏటీఎంలు కమ్మని కథలు అందిస్తాయి!

Tuesday, April 17th, 2018, 09:48:48 PM IST


కొన్ని సంవత్సరాల క్రితం డబ్బులు డ్రా చేయాలంటే మనం బ్యాంకులకు వెళ్లి చాలా సేపు క్యూ లో నిలబడి విత్ డ్రా ఫారం పూర్తిచేసి కానీ డబ్బులు తీసుకోవడానికి వీలు లేదు. కానీ ఆతరువాత ఏటీఎం లు అందుబాటులోకి వచ్చాక ప్రతిఒక్కరికి బ్యాంకు కి వెళ్లే అవసరం లేకుండా, మనకి దగ్గరలో వున్నా ఏటిఎంకి వెళ్లి తేలిగ్గా డబ్బు తీసుకునే వెసులుబాటు దొరికింది. అయితే మనకు తెలిసినతవరకు ప్రస్తుతం ఇండియా లో కేవలం డబ్బు తీసుకునే ఏటీఎం లు మాత్రమే వున్నాయి.
అయితే ఇటీవల షార్ట్ ఎడిషన్ పబ్లిషర్స్ అనే ఫ్రెంచ్ సంస్థకు తొలిసారి ఈ ఆలోచన వచ్చింది.

ఆలోచనలకు తగ్గట్టుగా 2016లో మొదటి సారి కమ్మని కథలను అందించే ఎటిఎంల రూపకల్పన చేసారు. సాహిత్యంపై అభిరుచి పెంచడానికి, పుస్తకం పఠనాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ తరహా ఏటీఎం లను తీసుకువచ్చారు. అయితే ఈ ఏటీఎం లలో కథలను చదవడానికి ఖర్చు అనేది ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 150కి పైగా యంత్రాలున్నాయి. ప్రస్తుతానికి అమెరికాలోని నాలుగు ప్రధాన నగరాల్లోని గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

కాగా ఒక్కో ఏటీఎం మెషీన్‌కు 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుండగా, స్టోరీల కోసం నెలవారీ రూ.12,500 ఖర్చు అవుతుంది. అయితే ఇవి ఎలా పని చేస్తాయని అనుకుంటున్నారా! స్థూపాకారంలో ఉండే ఓ మెషీన్‌పై మూడు బటన్లు ఉంటాయి. ఒక బటన్ నిమిషాన్ని సూచిస్తే, రెండో బటన్ మూడు నిమిషాలను, మూడో బటన్ ఐదు నిమిషాలను సూచిస్తుంది. అంటే అంత వ్యవధిలో చదివే స్టోరీలు అన్నమాట. మూడ్‌ని బట్టి ఆయా స్టోరీలను మనం ఎంపిక చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే ఓ పేపర్‌లో స్టోరీ బయటకు వచ్చేస్తుంది. హాయిగా దాన్ని చదివేసుకోవచ్చు. కథల్లో ఫిక్షన్, చిన్నపిల్లలకు సంబంధించిన, రొమాన్స్ ఇలా రకరకాలవి ఉన్నాయి…..

  •  
  •  
  •  
  •  

Comments