ఇది కూడా ఆపరేషన్ గరుడలోని ఒక భాగమే..!?

Tuesday, September 25th, 2018, 10:47:21 PM IST

ఆ మధ్య నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ పేరిట కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మంది శక్తులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిచ్చు పెట్టాలని చూస్తన్నారు అంటూ తీవ్ర దుమారాన్ని లేపి నవ్వులు పాలయ్యాడు,ఆ తర్వాత మళ్ళీ కొద్దీ రోజుల క్రితం ఈ సారి ఆపరేషన్ గరుడ మళ్ళీ రాబోతుంది అని,ఈ సారి మాత్రం ఈ ఆపరేషన్ వేరే విధంగా ఉండబోతుంది అని దాని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు తనకి ప్రాణ ఉందని మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు.

ఈ సారి జరగబోయే ఆపరేషన్ గరుడలో చంద్రబాబు మీద కొన్ని కేసులు బనాయించవచ్చని కూడా పేర్కొన్నారు,ఈ విషయంపైనే టీడీపీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి మీద వస్తున్న ఆరోపణలు చూస్తుంటే ఆపరేషన్ గరుడలోని ఒక భాగం లాగే ఉందని,దానిని కోసం ప్రస్తావించిన కొద్దీ రోజులోనే బాబ్లీ కేసును బయటకు తీసుకువచ్చారని అంతే కాకుండా చంద్రబాబు నాయుడు మరియు నా లోకేష్ అద్భుతంగా పాలన సాగిస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారు కావాలనే వారి మీద ఎవరితోనో అవినీతి ఆరోపణ కేసులు వెయ్యిస్తున్నారని ఇదంతా ఆపరేషన్ గరుడ లోని ఒక భాగంగా కావాలనే కుట్ర పన్నుతున్నారని తెలిపారు.కానీ ఇదంతా చంద్రబాబు కావాలనే తన మీద సింపథీ కోసం చేస్తన్న డ్రామా అని ఇతర పార్టీల వారు పేర్కొంటున్నారు.