ఇదే జూనియర్ అక్కినేని ఫ్యామిలీ…!!

Sunday, November 6th, 2016, 01:07:37 PM IST

akkineni-family
తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. మొదట అక్కినేని నాగేశ్వర్ రావు వారి పుత్ర రత్నం యువ సామ్రాట్ నాగార్జున చిత్ర పరిశ్రమల్లో అగ్ర హీరోల్లో ఒకరు. నాగార్జున పుత్ర రత్నాలైన నాగ చైతన్య, అఖిల్ యువ హీరోలుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న విషయం అందరికీ విదితమే. అయితే నాగార్జున పుత్ర రత్నాల వివాహం ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలోనే హాట్ టాపిక్. అక్కినేని అఖిల్‌.. ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియ భూపాల్‌ని, అక్కినేని నాగచైతన్య.. సమంతని వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటివరకు ఈ కాబోయే జంటలు విడివిడిగా దిగిన ఫొటోలే సోషల్‌మీడియాలో కనిపించాయి కానీ తొలిసారి నలుగురూ కలసి ఒకే ఫొటో దిగారు. సమంత, నాగచైతన్య, అఖిల్‌, శ్రియలు కలిసి దిగిన ఫొటోని సమంత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఫ్యామిలీ’ అని హ్యాష్‌టాగ్‌ ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.