చింతమనేని విషయంలో చంద్రబాబు మౌనం అందుకేనా.?

Thursday, March 14th, 2019, 05:50:33 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికలకు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అక్కడ ఉన్న మూడు పార్టీల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాలను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల తాలుకా మొదటి జాబితాను విడుదల చేసారు.అయితే ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చెయ్యబోయే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు.ఈ జాబితాలో ఎన్నో కేసులు ఉన్న దెందులూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు కూడా ఉందనున్నట్టు తెలుస్తుంది.

అయితే చింతమనేని విషయంలో ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి.మహిళలను కొట్టడం అక్కడ ప్రజలను కులం పేరు పెట్టి దూషించడం ఇలా చాలా రకాల అభియోగాలే అతని పై ఉన్నాయి.అయినా సరే చంద్రబాబు మాత్రం ఇంకా ఈయన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.అయితే దీనికి ఒక బలమైన కారణమే ఉందట అక్కడ నియోజకవర్గం నుంచి చింతమనేని తప్ప మరో బలమైన అభ్యర్థి ఎవరు చంద్రబాబుకి కనిపించలేదట అందుకనే చింతమనేని పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.పార్టీ పరంగా అక్కడ ఇతర పార్టీల అభ్యర్థులకు కూడా ధీటైన అభ్యర్థి చింతమనేనే అన్న భావనలో కూడా చంద్రబాబు ఉన్నారని అందుకే ఈ సారి ఎన్నికల్లో కూడా అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.మరి ఈ సారి ఎన్నికల్లో అవకాశం ఇస్తే అక్కడి ప్రజలు గెలిపిస్తారో లేదో చూడాలి.