ఇలా అయితే మహేష్ కి పెద్ద దెబ్బే..!

Tuesday, February 12th, 2019, 11:29:06 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మహర్షి”.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి వస్తున్న న్యూస్ ప్రకారం అంచనాలు భారీ గానే పెరిగాయి.అలాగే మహేష్ కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్టామినా ఉందో కూడా అందరికి తెలుసు.కానీ ఈ సినిమా విషయంలో మాత్రం మహేష్ కు పెద్ద దెబ్బ తగిలేలా ఉంది..ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ 25న విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేసేసారు.

ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ ఈ సినిమాకి పెద్ద తలనొప్పిగా మారింది.ఎందుకంటే ఆ సమయంలోనే సరిగ్గా 30న ఏపీ ఎన్నికలు ఉన్నాయి..ఆ సమయంలో ఈ సినిమా అంటే అది పెద్ద రిస్క్ అనే చెప్పాలి.భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కానీ ఆ సమయంలో విడుదల చేసినట్టయితే వసూళ్లకు గండి పడుతుంది.దాని వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా రావచ్చు.మరి ఈ విషయాన్ని గ్రహించి మహర్షి టీమ్ కాస్త ముందుగానే విడుదల చేస్తే మంచిదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.