ఏంటి..ఒక్క పిజ్జా లక్షన్నరా..?

Tuesday, January 29th, 2019, 06:51:04 PM IST

మాములుగా భోజన ప్రియులు వారు తినే పదార్ధాల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు.కొంత మంది మహా అయితే వేలల్లోనో లేక అంతకు మించి కొద్దో గొప్పో పెడతారు.కానీ ఒక్క పిజ్జా కొనడానికి అక్షరాలా లక్షన్నర అంటే ఎవరైనా ఆలోచించాల్సిందే.ఒక్క పిజ్జా కోసం లక్షన్నరా..?అందులో ఏం గొప్ప ఉంది అని అనుకుంటున్నారా..?ఇందులో కూడా ఒక “బంగారం” లాంటి ప్రత్యేకత ఉంది.

న్యూయార్క్ సిటీలో “ఇండస్ట్రీ కిచెన్” అనే రెస్టారెంట్లో తయారయ్యే ఈ పిజ్జాలో అన్ని రకాల మసాలా దినుసులతో పాటు మరో ప్రత్యేక పదార్ధం కూడా కలిపి అక్కడ వారి కస్టమర్లకు అందజేస్తారట.అదే 24 క్యారెట్ల మేలిమి బంగారం.దీనినే “గోల్డ్ పిజ్జా”గా వారు పిలుస్తారు.అందుకనే ఈ పిజ్జా చాలా కాస్ట్లీ గురు అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.ఈ పిజ్జాను అక్కడ 2000 డాలర్లకు అమ్ముతున్నారట,అంటే మన కరెన్సీలో మార్చినట్టయితే అక్షరాలా 1 లక్షా 42 వేలకు పైబడే ఉంది.అంతే కాకుండా అక్కడ మరో 6 పదార్ధాలు బంగారం పూతతో తినెయ్యొచ్చట అవి..

2) గోల్డ్ ఐస్ క్రీమ్
3) గోల్డ్ బాగల్
4) గోల్డ్ గ్రిల్ల్డ్ చీస్
5) గోల్డ్ చాకోలెట్స్
6) గోల్డెన్ హాజెల్ నెట్
7) గోల్డ్ డోనట్.
ఇవే అక్కడ దొరికే 7 బంగారంతో తినేసే పదార్ధాలు.ఒక వేల మీరు న్యూయార్క్ నగరానికి వెళ్తే మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి.