ఈ సారి ఫిట్ నెస్ ఛాలెంజ్ తారక్-సూర్య-పృథ్విరాజ్ లది!

Thursday, May 31st, 2018, 01:08:52 AM IST


హం ఫిట్ తో ఇండియా ఫిట్ ఛాలెంజ్ ప్రస్తుతం ఇండియన్ సెలెబ్రిటీల మధ్య మంచి జోరుతో సాగుతోంది. దీన్ని మొదట కేంద్ర మంత్రి మరియు ప్రొఫెషనల్ గా మంచి పేరున్న షూటర్ అయిన రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్ తొలుత ఈ ఛాలెంజ్ కు హ్రితిక్, విరాట్ కోహ్లీ తదితరులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత అది పలువురు సెలెబ్రిటీలను పాకింది. అయితే ప్రస్తుతం రాథోడ్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు తన ఛాలెంజ్ ను విసిరారు. రాథోడ్ ఛాలెంజ్ ను ఆనందంతో స్వీకరిస్తున్నాను అని చెప్పి సోషల్ మీడియా లో తాను స్పోర్ట్స్ వేర్ ధరించి డంబెల్స్ తో ఎక్సెర్సయిజ్ లు చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేశారు మోహన్ లాల్. అయితే ఆయన తన వంతుగా ఈ ఛాలెంజ్ కు టాలీవుడ్ హీరో తారక్, అలానే తమిళ స్టార్ సూర్య, మలయాళ స్టార్ పృథ్విరాజ్ లకు సవాల్ విసిరారు.

అయితే ఇప్పటివరకు సమంత, నాగ చైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదితరులు ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పూర్తితో తాను ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ను ప్రారంభించినట్లు చెప్తున్నారు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. ప్రధాని మోడీ ప్రజలందరికీ తనవంతుగా మంచి చేసి, ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం ఎలా సంపాదించారో ,అలానే ప్రజలందరూ ఫిట్ గా ఉంటేనే యావత్ భారతావని మొత్తం ఫిట్ గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించాను అని రాథోడ్ అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments