ఈసారి ఉస్మానియా ఎవరి వైపు ?

Thursday, October 4th, 2018, 09:37:26 AM IST

తెలంగాణ కల సాకారమవడానికి, కేసిఆర్ ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం విద్యార్థులు. ఉస్మానియా విశ్వ విద్యాలయ ప్రాణగణంలోని విద్యార్థుల్లో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ జ్వాల రాష్ట్ర యువతమొత్తాన్ని ఒక్క తాటిపైకి తెచ్చి కేసిఆర్ వెనుక నిలబడేలా చేసింది. యువకులే ఊరు ఊరునా తెరాసాకు ప్రచారం చేసి తిరుగులేని మెజారిటీతో గెలిపించారు.

అలాంటి తమను కేసిఆర్ ప్రభుత్వంనిర్లక్ష్యం చేసిందని, ఇచ్చిన లక్షల ఉద్యోగాల హామీని విస్మరించిందని, కనీసం ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు సైతం సరైన న్యాయం చేయలేకపోయారు కేసిఆర్ అని స్టూడెంట్స్ విమర్శిస్తున్నారు. టిఆర్ఎస్ పాలనలో తమకు రాయల్ ట్రీట్మెంట్ ఉంటుందనుకుంటే కనీసం కలవడానికి కూడ సిఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని కోపంగా ఉన్నారట. దీంతో ఉస్మానియా ప్రాంగణంలోని విద్యార్థి సంఘాల్లో ఎక్కువ శాతం ఈసారి కేసిఆర్ కు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయట.

ఇది టిఆర్ఎస్ పార్టీకి తప్పకుండా పెద్ద నష్టాన్నే చేకూరుస్తుంది. ఇక కేసిఆర్ కు వ్యతిరేకంగా పనిచేయనున్న ఈ విద్యార్థులంతా ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే గత ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కొండరామ్ పేరు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పేరు వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు పార్టీల్లో ఎవరు విద్యార్థుల మద్దతును కూడగట్టుకుంటే వాళ్లకు మంచి ఫలితాలు దక్కనున్నాయి.