ఆ పచ్చని పల్లెలో అంతా డిజిటల్ లావాదేవీలే జరుపుతారు

Thursday, December 29th, 2016, 12:50:42 AM IST

villege
మోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తరువాత దేశవ్యాప్తంగా విపరీతమైన నగదు కొరత ఏర్పడింది. ఈ నగదు కొరతను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకుని దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో మోరి అనే ఒక మారుమూల గ్రామంలో ఇప్పుడు అసలు ఎవరిదగ్గరా కరెన్సీ నోట్లు కనబడడంలేదు. ఈ గ్రామం డిజిటల్, క్యాష్ లెస్, స్మార్ట్ అంటూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది.

ఈ ఊరంతా ఎక్కడ చూసినా ఎల్ఈడి బల్బులే కనిపిస్తాయి. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ లే ఉంటాయి. గ్రామంలో అన్ని లావాదేవీలు డిజిటల్ గానే జరుగుతాయి. ప్రతి దుకాణం ముందు పేటీయం బోర్డులు కనిపిస్తాయి. అక్కడ ఎవరైనా ఏదైనా కొని డబ్బులు ఇవ్వాలనుకుంటే అక్కడి జనం వింతగా చూస్తారు. ఈ సంఘటనను బట్టి ఆదాయ అలవాట్ల నుండి భారత దేశం చాలా వేగంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి మోరి గ్రామం డిజిటల్ పల్లె గా మరి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments