ఈ వైరస్ చాలా “డేంజరస్”

Wednesday, May 23rd, 2018, 12:01:02 PM IST

గత కొంత కాలం గా ఒక వైరస్ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తుంది. అయితే ఆ మహమ్మారి వైరస్ ఇప్పటికే చాల మందిని పొట్టన పెట్టుకుంది ఇంతకీ ఆ వైరస్ పేరు ఏంటంటే “నిఫా వైరస్ ఇప్పటికే ఇ వైరస్ సోకి పదులకి పైగా సంఖ్య లో ప్రజలు మరణించారు. ఇప్పటి వరకు కేరళలో ఈ వైరస్ ప్రభావితం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరియు ఇది వరకే కేరళ లోని ఒక ఆసుపత్రి లో పని చేసే స్టాఫ్ నర్స్ కూడా ఈ వ్యాధి సోకి మరణించింన విషయం తెలిసిoదే….

అయితే తాజాగా హైదరాబాద్ లో కూడా ఈ వైరస్ కి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇప్పటికే ఈ వైరస్ వల్ల మరణించిన వ్యక్తులు సంఖ్య వేరు వేరు చోట్లలో పదికి పైగానే చేరింది . అయితే దీనిపై స్పందించిన వైద్య అధికారులు ప్రజలు చాల అప్రమత్తం గా ఉండాలని మరియు ఏ చిన్నపాటి ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే దగ్గర లో ఉన్న డాక్టర్ ని సంప్రదించాలని సూచించారు .అయితే వైద్య నిపుణులు మాత్రo ఇప్పటి వరకు వచ్చిన నిఫా వైరస్ కు సంబందించిన కేసుల రక్త నమూనాలను సేకరించామని మరియు సాంపిల్స్ ను లాబ్స్ కి పంపామని చెప్పారు. అయితే ప్రజలు ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దని తొందరలోనే ఈ వైరస్ కి సంబందించిన టీకా ను కనుకుంటామని , ఈ వ్యాది నివారణ చర్యలు కూడా చేపడుతామని తెలియజేసారు …

  •  
  •  
  •  
  •  

Comments