టిడిపి రాజ్యసభ అభర్ధులు వీరే!!

Sunday, March 11th, 2018, 04:23:10 PM IST

రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అభ్యర్థులు గా ప్రకటిస్తారు అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ రేగుతోంది. అందునా మరీ ముఖ్యంగా టిడిపి నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థులు ఎవరా అనే దానిపై పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ, అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఖరారయినట్లు తెలుస్తోంది. ముందుగా సీఎం రమేష్‌తో పాటు వర్ల రామయ్య పేరు రాజ్యసభ రేసులో వినిపించింది. వారిద్దరి పేర్లు ఖరారైనట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అనూహ్య పరిస్థితుల మధ్య కనకమేడల రవీంద్రకుమార్‌ పేరు తెరపైకి రావడం, ఖరారు కావడం వెనువెంటనే జరిగిపోయింది. మొత్తం రెండు స్థానాలకు గాను సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్లను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

సీఎం రమేష్‌ ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, కనకమేడల రవీంద్రకుమార్‌ టిడిపి లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. చిత్తూరు సీఎం సొంత జిల్లా కావడంతో, అక్కడి నుంచి ప్రస్తుతం రాజ్యసభకి ప్రాతినిథ్యం వహిస్తున్న సి.ఎం.రమేష్‌కి మరోసారి అవకాశమివ్వాలని చంద్రబాబు భావించారు. మరోవైపు కడప జిల్లా నుంచి సీఎం రమేష్‌కు పోటీగా జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ప్రతిపక్ష నేత జగన్‌పై తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో పోటీ చేయటంతో పాటు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన తీరు తనకు తెలుసునని, ఆయన రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని సీఎం నుంచి హామీ వచ్చిన కారణంగా శ్రీనివాసులరెడ్డి రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ రెడ్డి సామాజికవర్గానికి ఎప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చిందని, అయితే ఇప్పుడు రాజ్యసభకు రెండు స్థానాలు మాత్రమే ఉండటంతో వారికివ్వడం సాధ్యపడటం లేదని చంద్రబాబు సోమిరెడ్డి కి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. అలానే బీసీల నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు జిల్లా నాయకులందరితో కలిసి ముఖ్యమంత్రిని కలిసి తనకు అవకాశమివ్వాలని కోరారు. చివరి వరకు ఆయన పేరు పరిశీలనలో ఉన్నా తర్వాత అవకాశాలు సన్నగిల్లాయని సమాచారం. కాగా వచ్చే ఎన్నికల్లో బీదా మస్తాన్ రావుకి తగిన ప్రాధాన్యత ఇస్తానని చంద్ర బాబు ఇచ్చిన హామీ మేరకు ఆయన తప్పుకున్నారు. టిడిపి ప్రభుత్వం పై ప్రజలకు ఎప్పుడు మంచి నమ్మకం ఉంటుందని, ఆ నమ్మకాన్ని తమ నేతలు ఎన్నటికీ వమ్ము చేయరని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు…

. గత మంత్రివర్గ విస్తరణలో రాయలసీమ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసినట్లు తెలిసింది. చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల నుంచి అమర్‌నాథ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు కల్పించటంతో పాటు తూర్పు రాయలసీమగా పిలిచే నెల్లూరు నుంచి సోమిరెడ్డికి అవకాశం ఇచ్చిన విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం. . కోస్తా జిల్లాల నుంచి బీసీ, ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావించడంతో.. . గత ఎన్నికల్లో ఆయనకు పార్టీ టిక్కెట్టు కేటాయించటం, ఆయన సోదరునికి ఎమ్మెల్సీగా అవకాశమివ్వటం తదితర కారణాలు కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు…

  •  
  •  
  •  
  •  

Comments