టీడీపీ, వైసీపీల అభ్యర్థుల జాబితాను ఆ ఇద్దరే డిసైడ్ చేస్తున్నారా..?

Thursday, March 14th, 2019, 12:11:41 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది ఏపీ, తెలంగాణల్లో ఒకేసారి ఎన్నికలు జరుగనుండటంతో తెలుగునాట రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు గట్టిగా నెలరోజుల సమయం కూడా లేకపోవటంతో పార్టీలన్నీ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయటం, ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేయటంలో తలమునకలయ్యాయి. అభ్యర్థుల జాబితా రెడీ చేయటంలో టీడీపీ దూకుడు ప్రదర్శిస్తోంది,ఇప్పటికే అభ్యర్థుల జాబితా రెడీ అయిపోయిందని సమాచారం. టీడీపీ అభ్యర్థుల జాబితా ఫైనలైజ్ చేయటంలో లగడపాటి కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే బాబు అభ్యర్థులను నిర్ణయిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

ఇక వైసీపీ విషయానికి వస్తే, ఆ పార్టీ వ్యూహాకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ అభ్యర్థుల జాబితాను నిర్ణయించటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఆ ఆపార్టీ నేతలే అంటున్నారు. నియోజకవర్గాల వారీగా ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే, పార్టీ గెలుపొందే అవకాశాలున్నాయో పరిశీలించి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే జగన్ అభ్యర్థులను నిర్ణయిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న జగన్ చంద్రబాబులు అందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని అర్థంఅవుతింది, మరి ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.