మంత్రి అచ్చెన్నాయుడికి రూ 80 లక్షలు టోపీ పెట్టిన జోతిష్యుడు..!!

Monday, January 15th, 2018, 08:33:15 AM IST

మంత్రి అచ్చెన్నాయుడుకి ఊహించని ఘటన ఎదురైంది. గ్రహస్థితి అనుకూలంగా లేదని అప్పటికే మంత్రి నుంచి రూ 80 లక్షలు గుంజిన ఓ జ్యోతిష్యుడు మరో మారు భారీ మొత్తంలో డబ్బు లాగేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ సారి అతడి ఎత్తుగడ బెడిసి కొట్టింది. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది నవంబర్ లో ప్రముఖ జోతిష్యుడు కాళిదాసు శర్మ అచ్చెన్నాయుడి చేత యాగం చేయించారు. గ్రహ స్థితి అనుకూలంగా లేదని యాగం చేస్తే పరిస్థితులు చక్కబడుతాయని నమ్మబలకడం తో రూ 80 లక్షలు ఖర్చు చేయించి మరీ యాగం నిర్వహించారు. ఆ యాగంలో అచ్చెన్నాయుడి దంపతులు పాల్గొన్నారు.

మరో మారు మంత్రి నుంచి భారీగా డబ్బు దండుకోవాలని పథకం వేసిన కాళిదాసు శర్మ క్రిమినల్ మైండ్ తో ఆలోచించాడు. మంత్రి అనుచరుల ఫోన్ నంబర్ ఉండడంతో వారికీ ఫోన్ చేసి తాను నక్సలైట్ మంత్రి అచ్చెన్నాయుడుని చంపేస్తామని బెదిరించాడు. గిరిజనుల సిమ్ నంబర్ నుంచి ఈ ఫోన్ చేయడం సంచలనంగా మారింది. మంత్రితో ప్రాణభయం పెంచేలా కాశిదాసు శర్మ తన అనుచరుడు అయిన శంకర్ రావు ద్వారా ఒడిశా నుంచి జిలిటెన్ స్టిక్కర్స్ తెప్పించాడు. మంత్రి ప్రయాణించే మార్గాల్లో వాటిని అమర్చారు. పోలీస్ లు వాటిని స్వాధీనం చేసుకుని విచారణన మొదలుపెట్టగా శంకర్ రావు పోలీస్ లకు పట్టుబడ్డాడు. అతడిని ఇంటరాగేట్ చేసిన పోలీస్ లకు అసలు వాస్తవం తెలిసింది. దీనితో పోలీస్ లు జ్యోతిష్యుడు కాళిదాసు శర్మని అదుపులోకి తీసుకున్నారు.