బ్యాంకోళ్లు యదవల్నే నమ్ముతారు..ఎస్బిఐ నెత్తిన బండేసిన సాఫ్ట్ వేరోళ్లు..!

Sunday, October 29th, 2017, 02:30:35 PM IST

శ్రమించి దేశానికి అన్నం పెట్టె రైతుకు రుణాలు మంజూరు చేయాలంటే బ్యాంకుల ప్రాణం పోతుంది. రైతులని ఆదుకునేందుకు, వారికి రుణాలు ఇచ్చి ప్రోత్సహించేందుకు మాత్రం బ్యాంకర్ల వద్ద సరైన పాలసీలు లేవు. సమాజంలో అక్రమార్కులుగా ముద్ర వేసుకున్న బడా బాబులకు మాత్రం వేలకోట్ల రుణాలు ఇచ్చి ఫూల్స్ కావడం ఈ బ్యాంకోళ్లకి సర్వ సాధారణం అయిపోయింది. వేలకోట్లు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా లాంటి వాళ్లు అనుభవించు రాజా అని పాడుకుంటూ దర్జా లైఫ్ ని అనుభవిస్తున్నారు. వారికి అప్పిచ్చిన బ్యాంకులు లబోదిబో మంటున్నాయి. నమ్మి మోసపోవడం బ్యాంకులకు అలవాటే అనే అపవాదు మరో మరు నిరూపితమైంది.

విశాఖకు చెందిన ఎస్బిఐ బ్యాంకు మూడు సాఫ్ట్ వేర్ కంపెనీలకు రుణాలు ఇచ్చి నిండా మునిగిపోయింది. తమ పరిస్థితి అర్థం అయ్యాక లబోదిబో మంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఎస్బిఐ బ్యాంకుకు మూడు సాఫ్ట్ వేర్ కంపెనీలు భూమిని షూరిటీ గా చూపించి 23 కోట్ల వరకు రుణాలు పొందారు. షూరిటీకి సంబంధించిన పత్రాలు నకిలీవని బ్యాంకు అధికారులకు ఆలస్యంగా తెలిసింది. ఓ ప్రభుత్వ భూమిని వీరు షూరిటీ కింద వాడుకునట్లు తెలియడంతో బ్యాంకు అధికారులు కంగుతిన్నారు. ప్రభుత్వ భూమికి నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసిన సాఫ్ట్ వేర్ కంపెనీలు వాటినే ఎస్బిఐకి సమర్పించారు. గ్లోబల్ టెక్ ప్రొ సొల్యూషన్ ప్రై.లిమిటెడ్, మమత టెక్నాలజీ సర్వీసెస్ ప్రై.లిమిటెడ్, హచ్ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ అనే మూడు సాఫ్ట్ వేరు సంస్థలు ఈ చీటింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. బ్యాంకు డైరెక్టర్లు ప్రస్తుతం పోలీస్ లకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments