బుల్లితెర హంగామ..బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రాలు అన్ని ఒకే రోజు.!

Saturday, December 1st, 2018, 04:04:04 PM IST

ఈ రోజుల్లో ప్రతీ ఒకరి చేతిలో స్మార్ట్ ఫోన్ వారి ఇంట్లో టీవీ సాధారణం అయ్యిపోయాయి.బుల్లితెర మీదనే ఎన్నో ఆకట్టుకునే షోలు,సీరియళ్లు,మరియు సినిమాలు ఎన్నెన్నో ప్రసారం అవుతుంటాయి.అందులోను వారాంతంలో శని మరియు ఆదివారాలు వచ్చాయంటే చాలు పోటాపోటీగా ఒక్కో ఛానెల్లో సూపర్ హిట్ చిత్రాలను వేసి టీఆర్పీ రేటింగులను పెంచుకుంటారు.అయితే రేపు ఆదివారం కావడంతో “జెమిని టీవి”లో మూడు సూపర్ హిట్ చిత్రాలను ప్రసారం చెయ్యనున్నారు.

రేపు ఉదయం 7:40 నిమిషాలకు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అదిరిపోయే హిట్ చిత్రం అయినటువంటి ‘ఠాగూర్” అలాగే ఆ తర్వాత 11:10 నిమిషాలకు విజయ్ ఆంటోనీ యొక్క తమిళ్ లోను ఇటు తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచి కలెక్షన్లు సాధించిన “బిచ్చగాడు” మరియు సాయంత్రం 5 గంటలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి “ధృవ” చిత్రం ప్రసారం కానున్నాయి.అలాగే వీటి మధ్యలో మధ్యాహ్నం 2:10 నిమిషాలకు రాజ్ తరుణ్ యొక్క “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” చిత్రం కూడా ప్రసారం కానుంది.

అలాగే ఈ రోజు మధ్యాహ్నం కూడా రెండు అద్భుత చిత్రాలు జెమిని ఛానల్ లో ప్రసారం కానున్నాయి.ఈ రోజు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు రాజశేఖర్ యొక్క తాజా సూపర్ హిట్ చిత్రం “Psv గరుడ వేగ” మరియు సాయంత్రం 6:05 నిమిషాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క వినూత్న చిత్రం “నాన్నకు ప్రేమతో” ప్రసారం కానున్నాయి.వీటితో పాటుగా అటు “స్టార్ మా” ఛానల్ లో కూడా ఉదయం 9 గంటలకు సూర్య హిట్ చిత్రం “సింగం 3” ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ ల కాంబోలో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ చిత్రం “జనతా గారేజ్” అలాగే నాచురల్ స్టార్ నాని మరియు సాయి పల్లవిల యొక్క కెరీర్ లో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలిచినటువంటి ఎం సి ఏ(మిడిల్ క్లాస్ అబ్బాయ్) చిత్రాలు కూడా ప్రసారం కానున్నాయి.ఇక బుల్లితెర ప్రేక్షకులకు ఈ రోజు రేపు ఫుల్ ఎంజాయ్ అనే చెప్పాలి.