వీడియో : అనకొండని ఆడేసుకుంటున్న మూడేళ్ళ బుడతడు..అదురు బెదురు లేదు..!

Sunday, October 15th, 2017, 04:33:00 PM IST

చిన్న వయసు నుంచే అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించే వారు చాలా అరుదుగా ఉంటారు. పాము అల్లంత దూరంలో ఉంది అంటేనే అంటారా దూరం పరిగెత్తే చిన్నపిల్లలే కాదు పెద్దవారూ ఉన్నారు.అలాంటి వారితో పోల్చుకుంటే ఈ 3 ఏళ్ల బుడ్డాడి ధైర్యం ఎవరెస్టు అంత ఎత్తులో ఉంటుంది. ఎందుకంటే ఈ బుడతడు ఆడుకునేదు సాదా సీదా బురద పాములతో కాదు.. రూపం చూడగానే ఒళ్ళు జలజరించే 20 అడుగుల అనకొండతో. నమ్మశక్యంగా లేదు కదూ. ఇది అక్షరాలా నిజం.

వివరాల్లోకి వెళితే.. వియత్నాంకు చెందిన ఈ బాలుడి పేరు తుయోంగ్. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతడి ఇంట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. తుయోంగ్ తల్లిదండ్రులు 20 అడుగుల పొడవు, 80 కేజీల బరువు ఉన్న అనకొండని ఇంట్లోనే వరద నీటిలో వదలి పెట్టారు. అది వారి పెంపుడు అనకొండ. తుయోంగ్ ఆ అనకొండతో ఆడుకుంటున్న దృశ్యాలు ఇవి. వీటిని సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయగా వైరల్గా మారాయి. దీనిని నమ్మని కొందరు గ్రాఫిక్స్ అని కొట్టి పారేశారు. బాలుడి ధైర్య సాహసాలని కళ్లారా చూడాలని స్థానికులు అతడి ఇంటికి వెళ్లగా ఇదంతా నిజం అని తేలింది. మూడేళ్ళ తుయోంగ్ అనకొండ తో ఆటలాడుకుంటున్న దృశ్యాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.