జిల్లా కలెక్టర్.. కానీ ఎన్నికల విధుల్లో తాను ఒక సిబ్బందిలా పని చేసింది..!

Monday, April 22nd, 2019, 02:00:33 PM IST

ఈ నెల 23 న కేరళలో జరుగుతున్న మూడో విడత ఎన్నికల సందర్భంగా స్వయాన ఒక కలెక్టర్ ఎన్నికల సామాగ్రిని మోయడం చూసి అందరూ శభాస్ అని ప్రశంసిస్తున్నారు. ఆమె ఓ జిల్లా కలెక్టర్‌ ఆమె ఆర్డర్ వేస్తే ఏ పని అయిన చేసిపెట్టే సిబ్బంది. కానీ అవేమీ ఆమె పట్టించుకోలేదు. ప్రభుత్వ సిబ్బందిలో తానూ ఒకరిని అనుకుని ఎన్నికల సామగ్రిని గదుల్లోకి మోసుకెళ్ళి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. కేరళలో రేపు ఎన్నికల సందర్భంగా త్రిశ్శూర్‌ జిల్లా కేంద్రానికి సంబంధించిన ఎన్నికల సామగ్రిని బరువైన ట్రంకుపెట్టెల్లో ఉంచి ఓ లారీలో పంపింది ఎన్నికల సంఘం పంపింది. అయితే త్రిశ్శూర్‌ జిల్లా కలెక్టర్‌ టి.వి.అనుపమ సమక్షంలో సామాగ్రిని తరలించాల్సి ఉంటుంది.

అయితే అక్కడున్న సిబ్బంది ఎన్నికల సామగ్రిని కలెక్టరేట్‌ కార్యాలయంలోని ఓ స్ట్రాంగ్‌రూంలోకి తరలిస్తున్నారు. ఇద్దరు ఉద్యోగులు లారీలో ఉండి పెట్టెల్ని అందిస్తున్నారు. కొందరు కానిస్టేబుళ్లు, మరికొందరు సిబ్బంది వాటిని మోస్తున్నారు. ఓ సందర్భంలో పెట్టె అందించే సమయానికి అక్కడ ఒక్క కానిస్టేబులే ఉండడంతో రెండోవైపు కలెక్టర్‌ టి.వి.అనుపమ పెట్టెను దించుకుని మోసుకుంటూ స్ట్రాంగ్‌రూంలోకి వెళ్లారు. అధికారినన్న అహంకారం లేకుండా సిబ్బందితో పాటుగా ఆమె ఇలా శ్రమించడం అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, నెటిజన్లు మాత్రం అందరూ ఇలానే ఆలోచించి పనిచేయాలని కలెక్టర్‌ టి.వి.అనుపమపై పొగడ్తల ప్రశంసాలను కురిపిస్తున్నారు.