ఇల్లు కూల్చేస్తున్నారని కన్న బిడ్డను మేడ పైనుండి విసిరేశాడు

Friday, April 13th, 2018, 07:06:39 PM IST

పిల్లలు పెరిగి తల్లిదండ్రుల మీద కర్కశంగా ప్రవర్తించడం చూసాం, కానీ ఇక్కడ కథ రివర్సయ్యింది. అక్రమ ఇండ్ల కట్టడాల కూల్చివేతలను అరికట్టేందుకు రక్తం పంచుకు పుట్టిన కన్నబిడ్డ ప్రాణాలను సైతం పణంగా పెట్టాడు ఓ కర్కశ తండ్రి.అసలు అక్క్రమంగా ఇల్లు కట్టుకోవడమే తప్పు, దాన్ని కూల్చి వేయాలని వచ్చిన పోలీసులను బెదిరంచడంతో పోలీసులకు ఇంకా కోపం పెరిగింది. కానీ అక్కడ తన బిడ్డని పైనుండి విసిరేస్తా అని భయపెట్టడంతో పోలీసులు అలాగే నిలబడిపోయారు, అంతలోనే బిడ్డను గాల్లో విసిరాడు ఆ తండ్రి, సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఓ పోలీసు అధికారి సమయానికి బిడ్డను సురక్షితంగా పట్టుకున్నాడు లేదంటే అక్కడిక్కడే ఆ పసిదాని ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయేవి.

ఈ దారుణ సంఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. క్వాడ్వేసీ ప్రాంతంలోని పోర్ట్‌ ఎలిజబెత్‌ ప్రాంతంలో పోలీసులు అక్రమ కట్టడాలను కూల్చడానికి వచ్చారు. కానీ ఇందుకు స్థానికులు ఒప్పుకోలేదు. ఇళ్లు కూల్చడానికి వీల్లేదని ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఓ 38ఏళ్ల వ్యక్తి తన రెండేళ్ల పాపని తీసుకుని ఇంటి మిద్దె పైకి ఎక్కాడు. ఇల్లు కూల్చేస్తే బిడ్డను విసిరేస్తానని బెదిరించాడు. ఇల్లు కోసం కన్నా బిడ్డని చంపేస్తావా అని అతని తెలివితక్కువ పనిని ఆపాల్సిందిపోయి చుట్టుపక్కల మిగతా స్థానికులంతా ‘విసిరెయ్‌..’ ఎం కాదు విసిరేయ్ అంటూ కేకలు వేశారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు బిడ్డను కాపాడేందుకు పక్క ఆలోచనతో సిద్ధమయ్యారు. ఇంతలో ఓ పోలీసు అధికారి వెంటనే ఇంటి పైకి ఎక్కి అతన్ని అదుపుచేయాలని ప్రయత్నం చేసాడు. అప్పటికే అతను బిడ్డను గాల్లోకి విసిరేశాడు. అదృష్టం బాగుండి కిందే ఉన్న పోలీసులు పాపను పట్టుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న మీడియా ఫొటోలు తీయడంతో వైరల్‌గా మారింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం అక్రమ కట్టడాలను పూర్తిగా అట్టడగులోకి కూల్చివేశారు. ఇంకోసారి ఇలాంటి అక్రమ కట్టడాలకు ఎవ్వరు ప్రయత్నించినా ఇకపై కఠిన శిక్షలకు అర్హులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు పోలీసులు.

  •  
  •  
  •  
  •  

Comments