నేడు కారేక్కనున్న తుమ్మల

Friday, September 5th, 2014, 09:12:11 AM IST


ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కీలక నేత అయిన తుమ్మల నాగేశ్వర్ రావు ఆ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్న సంగతి తెలిసింది. అయితే అయన గులాబీ కందువ కప్పుకునే సుభ ముహూర్తం ఈరోజే.శుక్రవారం సాయంత్రం 5గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో లాంచనంగా చేరనున్నారు.అయనతో పాటు పెద్ద ఎత్తున అనుచరులు, టీడీపీ కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరనున్నారు. సుమారు 3వేల వాహనాల్లో ఖమ్మం నుంచి ఉదయం 9గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఎల్ బీ నగర్, ఉప్పల్ రింగ్ రో డ్డు, రైల్ నిలయం, బేగంపేట, ఎల్వీ ప్రసాద్ దవాఖాన మీదుగా తెలంగాణభవన్ వరకు ర్యాలీగా చేరుకోనున్నారు. ఈ దారి పొడువునా గులాబీ ఫ్లేక్సిలతో అంతా గులాబీ మయం అయ్యాయి. అయితే గత రెండు రోజులుగా తుమ్మల అనారోగ్యంతో యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలోని ఇతర పార్టీల కీలక నేతలు కూడా త్వరలో గులాబీ పార్టీలో చేరనున్నారు.