రానున్న రోజుల్లో వర్షాలతో జాగ్రత్తగా ఉండాలి: వాతావరణ శాఖ

Wednesday, May 9th, 2018, 08:55:50 AM IST

ప్రస్తుతం దేశంలో వాతావరణ పరిస్థితులు ఊహించని విధంగా తారుమారవుతున్నాయి. అధిక ఎండలతో అధిక వానలతో దేశ నలువైపులా విభిన్న వాతావరణం నెలకొనడంతో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధిక ఎండలు మనిషిని సతమత చేస్తోన్న సంగతి తెలిసిందే. మరో వైపు ఇటీవల కురిసిన వానలకు ఎఫెక్ట్ కూడా బాగానే పడింది. పిడుగుపాటుకు వరుస చావులు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలని కదిలించాయి. అయితే రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

ముందుగా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వానలు వచ్చే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఒక ఐదు రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంటామని వాతావరణ శాఖ జాగ్రత్తలు తెలుపుతోంది. సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు నాన్ స్టాప్ గా జమ్మూకశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా అలాగే ఛండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ రాజస్తాన్‌ వంటి ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో అలజడి సృష్టిస్తూ వర్షాలు కురిశాయని వాతావరణం నిపుణులు తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments