“మహర్షి”ని ఇంకా ప్లాప్ గానే చూస్తున్న మహేష్ అభిమానులు.!

Tuesday, June 4th, 2019, 09:50:51 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “మహర్షి”. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ముందు ఒక్క రోజు మాత్రమే డివైడ్ టాక్ తెచ్చుకున్నా రోజులు గడుస్తున్న కొద్దీ బాక్సాఫీస్ దగ్గర చాలా బలంగా నిలబడింది.అందుకు నిదర్శనంగా ఈ చిత్రం ఇప్పుడు 100 కోట్ల షేర్ మార్కును కూడా అందుకుంది.అయినా సరే ఈ చిత్రాన్ని మహేష్ అభిమానులు ఇంకా ప్లాప్ చిత్రంగానే ముద్ర వేసి గొప్పలు చెప్పుకుంటున్నారు.

నిడివి ఎక్కువ కావడం వల్ల వీరికి అంతగా ఎక్కలేదేమో కానీ జెనరల్ ఆడియెన్స్ కు మాత్రం ఈ చిత్రం బాగా కనెక్ట్ కావడంతో ప్రతీ ఒక్కరు ఈ చిత్రాన్ని ఆదరించారు.అందుకు తగ్గట్టుగా మంచివసూళ్లు రాబడుతుంటే వీరు మాత్రం ఈ చిత్రాన్ని ఇంకా ప్లాప్ జాబితాలోనే ఉంచి ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి అంటే అది మహేష్ యొక్క స్టామినా మాత్రమే అని గొప్పలు చెప్తున్నారు.నిజంగా మహేష్ సినిమాలో మ్యాటర్ లేదు ప్లాప్ టాక్ వచ్చింది అంటే అందుకు నిదర్శనంగా చాలా సినిమాల ఫలితాలు ఉన్నాయి.అలాంటిది ఈ చిత్రాన్ని వారు ఇంకా ప్లాప్ చిత్రంగానే భావిస్తూ ఉండడం కరెక్ట్ కాదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.