హైద‌రాబాద్‌లో 35 ఏళ్ల‌లో 63 సార్లు భూకంపం!

Tuesday, September 20th, 2016, 10:19:43 PM IST

Hyderabad
ఎక్క‌డినుంచి ఊడిప‌డిందో… హ‌ఠాత్తుగా ఈరోజు ఓ విప‌త్తుకు సంబంధించిన‌ వార్త హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల్ని బెంబేలెత్తించింది. హైద‌రాబాద్‌లో భూకంపం.. స్వ‌ల్పంగా కంపించిన భూమి అంటూ టీవీల్లో స్క్రోలింగులు క‌దిలేస‌రికి జ‌నాల‌కు గుండెలు గుభేల్మ‌న్నాయి. కాసేపటికి భూమి కంపించింది సెప్టెంబ‌ర్ 19న. అయితే ఆ సంగ‌తిని ఎవ‌రూ గుర్తించలేదు. ఈ కంప‌నం కేవ‌లం రిక్ట‌ర్ స్కేల్‌పై 0.9 మాత్ర‌మే. అందువ‌ల్ల భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌ని తేల్చారు.

శాస్త్ర‌వేత్త‌ల విశ్లేష‌ణ ప్ర‌కారం… సెస్మిక్ జోన్‌-2లో హైద‌రాబాద్ ఉంది. ఇది సేఫే నంటూ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. రిక్ట‌ర్‌స్కేల్‌పై 0.9 తీవ్ర‌త చూపించింది. అది కూడా ఒకేసారి వ‌చ్చింది. .. కాబ‌ట్టి హైద‌రాబాద్‌కి వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని భూకంప‌న ప‌రిశోధ‌క శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. హైద‌రాబాద్‌లోఓ గ‌త 35 ఏళ్ల‌లో 63 సార్లు భూమి కంపించింది. గండిపేట‌, మేడ్చ‌ల్ వంటి చోట భూకంపం వ‌చ్చింది. అయితే మేడ్చ‌ల్‌లో గ‌రిష్ఠంగా 4.5 మ్యాగ్నిట్యూడ్‌తో భూమి కంపించింది. జూబ్లీహిల్స్ ప‌రిస‌రాల్లో 2.8 తీవ్ర‌త‌తో, వ‌న‌స్థ‌లి పురంలో 1.1 మ్యాగ్నిట్యూడ్‌తో, ప‌హ‌డీ ష‌రీఫ్ ప్రాంతం లో భూకంపం గ‌తంలో వ‌చ్చింది. తాజాగా జ‌గ‌ద్గిరిగుట్ట‌, కుత్బుల్లాపూర్‌లో 0.9 మ్యాగ్నిట్యూడ్‌తో భూమి కంపించింది. ఇది ప్ర‌మాద‌క‌రం కాద‌ని శాస్త్ర‌వేత్త‌లు హీట్‌ని చ‌ల్ల‌బుచ్చారు. 4.5 కంటే త‌క్కువ భూకంపం ఉంటే ప్ర‌మాదం లేన‌ట్టే. అయితే ప్ర‌కృతి ప్ర‌కోపిస్తే ఏ విశ్లేష‌ణ‌లు నిల‌బ‌డ‌వు. కాబ‌ట్టి భవిష్య‌త్‌లో ఎలాంటి విప‌త్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు యంత్రంగం సిద్ధంగా ఉందా? అన్న‌ది ప్ర‌భుత్వాలు ఆలోచించుకోవాలి.