స్మార్ట్ సిటీస్ కాదు..స్మార్ట్ ఎస్కేప్..!

Wednesday, September 28th, 2016, 04:55:59 PM IST

venkai-naidu
తెలుగులో ఓ సామెత ఉంది..పేరుగొప్ప ఊరు దిబ్బ అని. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్మార్ట్ సిటీస్ పథకం పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది.దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీస్ గా తీర్చిదిద్దే పథకాన్ని నరేంద్రమోడీ ప్రారంభించినపుడు అందరు గొప్ప పథకం అని సంబర పడ్డారు. కానీ ఆచరణ చూస్తుంటే పేరుగొప్ప ఊరు దిబ్బ అనే సామెతే గుర్తుకు వస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం 3 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలనీ నిర్ణయించింది.విశాఖ పట్నం, తిరుపతి, కాకినాడ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ నగరాలను కేంద్రం ఎంపిక చేయడం ఎంతవరకు సంమంజసమో ఇప్పుడు చూద్దాం..

తిరుపతి.. ఇది ఓ ఆధ్యాత్మిక నగరం.కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉండడంతో దీని అభివృద్ధి ఎప్పుడో సాధ్యమైంది.పాలకులు చేయవలసిన పనల్లా దీనిలో ఉన్న వసతులను సక్రమంగా నడిపించడమే. తిరుపతి లో విమానాశ్రయం, విశ్వవిద్యాలయం వంటివి ఉన్నాయి.మరిన్ని ప్రభుత్వ రంగ, ప్రయివేటు రంగ సంస్థలు ఈ నగరానికి వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది. స్మార్ట్ సిటీల లక్ష్యం సరైన వసతులు లేని నగరాల్లో వసతులను నిర్మించడమే కావలి. అంతే కానీ ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరాలను స్మార్ట్ గా చేస్తానంటే ఎలా..?ఇక విశాఖ నగరం కూడా పారిశ్రామికంగా ఎంతో అధివృధి చెందింది.పారిశ్రామికంగా కాక పర్యాటకంగా కూడా విశాఖ అభివృద్ధి చెందిన నగరమే.అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉండి కూడా ఇంకా అభివృద్ధి అరకొర మాత్రమే జరిగిన నగరాలు ఆంధ్రప్రదేశ్ లో చాలానే ఉన్నాయి. నెల్లూరు, కర్నూలు వంటి నగరాలు ఈ కోవకే చెందుతాయి. అలంటి వాటిని స్మార్ట్ గా తయారుచేయకుండా ..ఆల్రెడీ స్మార్ట్ గా ఉన్న నగరాలకు మేకప్ వేస్తానంటే ఎలా మోడీగారూ..?దీనినే స్మార్ట్ ఎస్కేప్ అంటారు.

  •  
  •  
  •  
  •  

Comments