జగన్ పై క్రిస్టియన్ పాస్టర్ వివాదస్పద వ్యాఖ్యలు.. జీసస్ శిక్షిస్తాడు

Saturday, November 11th, 2017, 08:30:09 PM IST

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాల్లో ఏ స్థాయిలో నటుస్తున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వైసిపి పార్టీ నాయకుడు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా పాదయాత్ర చేస్తున్నాడు. అంతే కాకుండా అధికార టీడీపీ పార్టీ నేతలపై విమర్శలు కూడా చేస్తున్నాడు. అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమదైన శైలిలో కౌంటర్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర కు ముందు తిరుపతి వెళ్లి శ్రీవేంకటేశ్వరుడిని పూజించిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని క్రిస్టియన్ సంఘాలు జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

క్రిస్టియన్ మతస్థుడైన జగన్ విగ్రహ ఆదరణను చేసిందనుకు జీసస్ శిక్షిస్తాడని ఇటీవల తిరుపతి చర్చిలో ప్రముఖ పాస్టర్ ప్రశంగించాడు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఆ వీడియో వైరల్ గా మారడంతో చర్చనీయాంశంగా మారింది. అయన మాట్లాడుతూ మాట్లాడుతూ.. ‘ఎంత విచారకరమంటే… కొండ మీదకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత జగన్ ఏమన్నారంటే.. పాదయాత్ర ప్రారంభించడానికి ముందు అయన ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని వచ్చాడంట అని కరుణాకరన్ తెలిపాడు. పశ్చాత్తాపం పొంది విగ్రహారాధనను విడిచిపెడితే దేవుడు కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాడని ఆయన ప్రసంగంలో తెలిపారు. అంతే కాకుండా ఆయన పశ్చాత్తాప పడకుండా విగ్రహారాధన చేస్తుంటే మాత్రం దేవుని యొక్క ఉగ్రతను ఆయన జీవితంలో చూడాల్సి వస్తుందని పాస్టర్ చెప్పాడని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments