ఏం.. ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదా ?

Sunday, October 14th, 2018, 10:46:07 AM IST

ఆంధ్రప్రదేశ్ లో తిత్లీ తుఫాను ప్రభావానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు బాగానే దెబ్బతిన్నాయి. తుఫాను సమయంలో 20 గంటల పాటు మేల్కొని అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయాక్ చర్యలని పర్యవేక్షించిన చంద్రబాబు ఆ తర్వాత వెంటనే తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ప్రయాతన ప్రారంబించారు.

టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో తన పనితనం గురించి ముందుగానే పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్లు ఊదరగొట్టి ఉండటంతో తుఫాను బాదితుల నుండి తనకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందని, జనాలంతా వచ్చి తనను కౌగిలించేసుకుంటారని అనుకున్నారు బాబు. కానీ సీన్ కాస్త రివర్స్ అయింది.

బాబు ఆశించింది జగకపోగా కొన్ని చోట్లా ప్రజలు కాన్వాయ్ కు అడ్డంపడి సహాయం అందట్లేదని నిలదీశారు. పర్యటనలో భాగంగా కవిటి గ్రామం మీదుగా వెళ్తున్న బాబు కాన్వాయ్ అక్కడ ఆగకుండా వెళ్లిపోతుండటంతో ఆగ్రహించిన గ్రామంలోని మత్స్యకారులు వాహనాలకు అడ్డంపడి సహాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బాబుకు కోపం నషాళానికంటింది. సాక్షాత్తు సిఎం కాన్వాయ్ కే అడ్డంపడతారా అంటూ కసురుకున్నారు. తుఫాను దెబ్బకి సర్వం కోల్పోయి కించిత్ సహాయం కూడ అందని ప్రజల్లో ప్రోటోకాల్, మర్యాదలు పాటించేంత సహనం ఉండదని బాబుగారికి ఎరుకైనట్టు లేదని ఆయన వ్యవహారాన్ని చూసిన చాలా మంది బాధితులు ఏం ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదా అంటూ నిలదీస్తున్నారు.