సార్వత్రిక ఎన్నికలో టీజేఎస్ – ఈసారి కూడా పొత్తేనా…?

Wednesday, March 13th, 2019, 04:57:40 PM IST

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ కూడా పోటీ చేసేందుకు సిద్దమవుతుంది. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేయనుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రకటించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నారని, మరో స్థానంపై పార్టీలో విస్తృతంగా చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము పోటీ చేయని స్థానాల్లో తమ మద్దతు కేవలం కాంగ్రెస్ పార్టీ కె ఉంటుందని కోదండరాం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆదివాసీల భూమి హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీ హక్కుల రక్షణ పేరుతో బస్సు యాత్ర చేపడతున్నట్లు తెలిపారు.