ధోని అడ్డాలో టెన్షన్ టెన్షన్..పీకల్లోతు కష్టాల్లో భారత్..!

Friday, March 8th, 2019, 07:35:04 PM IST

భారత్ మరియు ఆసీస్ మధ్య ఐదు మ్యాచుల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసినదే.ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచేసిన భారత్ ఇప్పుడు మూడో మ్యాచుకి చేతులెత్తేసింది.ఈ రోజు ధోని జన్మ స్థలం అయిన రాంచీ వేదికగా ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ మొదలయ్యింది.టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ పై ఆసీస్ ముందు రెండు మ్యాచుల రివెంజ్ ని తీర్చుకుందామని గట్టిగానే ఫిక్స్ అయ్యినట్టున్నారు.దానికి తోడు మన బౌలర్లు కూడా చేతులెత్తేయడంతో నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 313 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.

ఇక బ్యాటింగ్ కి దిగిన ఆదిలోనే ధావన్ మరియు రోహిత్,రాయడుల వికెట్లు పడిపోవడం పెద్ద దెబ్బేసింది.ఆ తర్వాత బరిలో దిగిన కెప్టెన్ కూల్ ఎం ఎస్ ధోని మరియు విరాట్ కోహ్లీలు కాస్త నెట్టుకొచ్చినా ఆ తర్వాత ధోని వికెట్ కూడా పడిపోవడంతో మ్యాచ్ మరింత కష్టతరంగా మారింది.ఆసీస్ జట్టులో కవాజా మరియు ఫించ్ లు రెచ్చిపోగా ఇప్పుడు కోహ్లీ పైనే భారం పడింది.ఇప్పుడు కోహ్లీ మరియు జాదవ్ లు గెలుపు కోసం పోరాడుతున్నారు.మరి ఈ ఇద్దరు ఎంత వరకు జట్టుని గెలుపు దిశగా తీసుకెళ్తారో చూడాలి.