విరాట్ సేనలో డివిలియర్స్ అనుమానమే?

Tuesday, May 1st, 2018, 02:18:08 PM IST

ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు – హైదరాబాద్ జట్టు టాప్ లో ఉన్నాయి. ఇక మూడు నాలుగు స్థానాలు చాలా వరకు చేంజ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇంతవరకు టోర్నీలో విరాట్ సేన మొదటి స్థానాన్ని అందుకోలేదు. కేవలం రెండు మ్యాచుల్లో విజయాన్ని అందుకున్న బెంగుళూర్ ఇక నుంచి ప్రతి మ్యాచ్ లో పోరాడక తప్పదు. ఈ రోజు ముంబై తో తలపడనున్న విరాట్ సేన తప్పకుండా గెలిచే తీరాలి. అయితే జట్టులో కీలక ఆటగాడు డివిలియర్స్ ఈ రోజు మ్యాచ్ లో ఆడే పరిస్థితి కనిపించడం లేదు.

తీవ్ర జ్వరంతో గత మ్యాచ్ కు దూరమైన మిస్టర్ 360 ఈ మ్యాచ్ కి కూడా ఆడటం లేదని సమాచారం అందుతోంది. ఇక ముంబై పరిస్థితి కూడా దారుణంగా మారింది. గెలుపు ఆ జట్టును చాలా ఊరిస్తోంది. అందినట్టే అంది విజయం చివరి నిమిషంలో మిస్ అవుతోంది. కీలక సమయాల్లో ప్రధాన ఆటగాళ్లు రానించకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనెస్ గా మారింది. ఇప్పటి నుంచి జరగబోయే మ్యాచ్ లలో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. మరి జట్టు ఎలా పోరాడుతుందో చూడాలి.