తెలంగాణ విమోచన దినం నేడే!

Wednesday, September 17th, 2014, 08:35:59 AM IST


హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిన సందర్భాన్ని ఏ విధంగా పరిగణించాలనిగత కొద్ది కాలంగా చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భాన్ని తెలంగాణ విలీన దినంగా పరిగణించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ మంగళవారం ప్రకటించారు. ఇక ఈ సందర్భాన్ని తెలంగాణ విమోచనదినంగా పరిగణించాలని భాజపా వర్గాలు ప్రకటించాయి. కాగా దీనిపై అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరిన రాజకీయ జేఏసీ, భాజపా, ఇతర పార్టీల విజ్ఞ్యప్తిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అంతగా పట్టించుకోలేదు. ఇక ఈ అంశంపై పలు వర్గాలు ప్రభుత్వాన్ని విమర్శించినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా నేడు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.