హాట్ టాపిక్‌: జేసీ (వ‌ర్సెస్) గౌడ్‌.. వాట్ హ్యాపెన్డ్‌!

Tuesday, December 27th, 2016, 03:32:09 PM IST

jc-was-goud
దివాకర్‌ ట్రావెల్స్‌ యజమాని జేసీ ప్రభాకర్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మధ్య ర‌చ్చ ర‌చ్చ‌కు కార‌ణాలేంటి? ఆ ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు నేరుగా ఢీకొన‌డానికి గ‌ల అస‌లు రీజ‌న్స్‌? .. తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

అమీర్‌పేట్‌, కూక‌ట్‌ప‌ల్లి, హైటెక్‌, మాదాపూర్‌, ఉప్ప‌ల్‌, ఎల్బీన‌గ‌ర్‌.. ప్లేస్ ఏదైనా.. అక్క‌డ నుంచి నిరంత‌రం ర‌క‌ర‌కాల సిటీల‌కు వెళ్లే ప్రయివేటు బ‌స్సుల‌న్నీ ఆంధ్రోళ్ల‌వేన‌న్న సంగ‌తి తెలంగాణ నేత‌ల‌కు బాగా తెలుసు. కార‌ణం ఏదైనా రాష్ట్రం విడిపోయాక‌.. ఈ ప్ర‌యివేటు బ‌స్సుల‌పై ఏదో ఒక కోణంలో ఎటాక్ సాగుతూనే ఉంది. తెలంగాణ‌లో ఉన్న విద్యాల‌యాలు, హోట‌ల్స్ స‌హా అన్ని రంగాల్లోనూ ఆంధ్రోళ్ల హ‌వా అన్న‌ది ప్ర‌త్యేకించి తెలంగాణ నేత‌ల్లో చ‌ర్చ‌కొచ్చింది. ఆ కోణంలో ఎటాక్‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌యివేటు ట్రావెల్స్‌పైనా అవి సాగుతున్నాయి. వాస్త‌వానికి ప్ర‌యివేటు ట్రావెల్స్ నిలువు దోపిడీ వాస్త‌వ‌మే అయినా.. ఆ మాట‌ను అస‌లు య‌జ‌మానులు ఒప్పుకోనే ఒప్పుకోరు.

క‌ట్ చేస్తే ఈరోజు గొడ‌వ‌కు .. ఆంధ్రావాలా అయిన జేసీ దివాక‌ర్‌రెడ్డికి,.. స్థానికుడైన తేరాస నేత శ్రీ‌నివాస్‌గౌడ్ మ‌ధ్య ఓ కొత్త యుద్ధం మొద‌లైంది. ఆ ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు స‌వాళ్లు విసురుకున్నారు. ప్ర‌యివేటు బ‌స్సుల దౌర్జ‌న్యం న‌శించాలంటూ గౌడ్ నిన‌దిస్తే.. బ‌స్సుల్లో ప్ర‌యివేటు య‌జ‌మానుల కీళ్లు విరిచేయాల‌ని శ్రీ‌నివాస్ గౌడ్ అంటున్నారు. ఈ విష‌యంపై తెలంగాణ అసెంబ్లీలో గౌడ్ బ‌ల‌మైన వాద‌న వినిపించ‌డంతో దివాక‌ర్ ట్రావెల్స్ అధినేత దివాక‌ర్‌కి ఒళ్లు మండింది. నిబంద‌న‌ల ప్ర‌కార‌మే బ‌స్సులు న‌డుపుతున్నామ‌ని, ఖైర‌తాబాద్ ఆర్డీఏ కార్యాల‌యం వ‌ద్ద చ‌ర్చ‌కు వ‌స్తావా? అంటూ దివాక‌ర్ స‌వాల్ విసిరారు. ఆ స‌వాల్ స్వీక‌రించిన గౌడ్ ఆర్డీఏ కార్యాల‌యానికి పెద్ద ఎత్తున అనుచ‌రుల‌తో చేరుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా ఆ చోట పోలీసులు మోహ‌రించాల్సొచ్చింది. జేసీని తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి పీసీకి త‌ర‌లించారు. ఉద్రిక్త‌త‌లు జ‌ర‌గ‌కుండానే ఈ చ‌ర్య అంటూ పోలీసులు చెబుతున్నారు. అస‌లింత‌కీ వాట్స్ హ్యాపెన్డ్‌.. అన్న‌ది అర్ధ‌మైందా?

  •  
  •  
  •  
  •  

Comments