నేటి విద్యార్థులే మన జాతి నిర్మాతలు… రాహుల్ గాంధీ

Thursday, December 6th, 2018, 09:00:40 PM IST

అవినీతి అంతం దిశగా రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ విద్యార్ధులకి ఓకే ఆలేఖ రాసాడు. అవినీతిని అంతం చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధమేనని రాహుల్ గాంధీ తెలిపారు. అవినీతితో వెనకబడిపోయిన మన సమాజాన్ని మార్చి, మంచి అవకాశాలు పొందడానికి తమ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఇప్పుడున్న విద్యార్థులే మన జాతి నిర్మాతలు అని అన్నారు. అన్ని దేశాలు యుద్ధంతో ముందుకు పోకుండా, శాస్త్ర సాంకేతిక, కళలు, సాహిత్యం తదితర రంగాలలో అభివృద్ధితో దూసుకెళ్లాలని రాహుల్ గాంధీ పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా రాహుల్ రాసిన లెకహ్ను అన్ని భాషల్లోకి అనువదించి, నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా దేశ వ్యాప్తంగా కళాశాలలకు పంపనున్నారు. రాహుల్ గాంధీ ‘బెటర్‌ ఇండియా’ పేరుతో చేస్తున్న ప్రచారంలో భాగంగా విద్యార్థులకు ఈ లేఖ రాశారు. విద్యార్థులకు దక్కాల్సిన గౌరవం దక్కేలా చేస్తామని, వారి ఆంక్షాలను నెరవేర్చుకోవడానికి కావాల్సిన మద్దతుని, సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అవినీతి అంతమే లక్ష్యంగా ముందుకెల్దామని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.