కారుతో గుద్ది జంప్ అయిన ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్!

Tuesday, May 22nd, 2018, 09:40:21 AM IST

మాస్ మహారాజ రవితేజ నటించిన పవర్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడుగా పరిచయమయిన బాబీ (కె ఎస్ రవీంద్ర) ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్ తో జై లవ కుశ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అయితే మొన్న ఆదివారం బాబీ ప్రయాణిస్తున్న కారు అమీర్ పెట్ లోని వ్యాపారి హార్మిందర్ సింగ్ కారును ఢీకొట్టిందని ఆయన దర్శకుడు బాబీ పై జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు. ఇక అసలు విషయంలోకి వెళితే, గత ఆదివారం రాత్రి హార్మిందర్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆరోజు అయ్యప్ప సొసైటీ లోని ఒక శుభకార్యానికి వెళ్లి వస్తుండగా జూబిలీ హిల్స్ రోడ్ నో 33 వద్దకు వచ్చేసరికి ఒక కారు వెనుక నుండి వేగంగా వచ్చి తమ కారును ఢీకొట్టడంతో అందరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డామని అన్నారు.

బయటకు వచ్చి చూస్తే కారు కొంత డామేజి అయిందని, ఇదేమిటని బాబీ ని నిలిదీస్తే, మా ఇల్లు ఇక్కడకి దగ్గర్లోనే వుంది వెళ్లి మాట్లాడుకుందాం రండి అని చెప్పి వెంటనే అక్కడినుండి ఉడాయించాడని, ఆ సమయంలో బాబీ మద్యం సేవించి వున్నాడని హర్మిందర్ చెపుతున్నారు. అలా వెనుకనుండి వచ్చి గుద్ది, మాకు ఏమి జరిగిందో పట్టించుకోకుండా, కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన బాబీ పై హార్మిందర్ జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఆయన మొత్తం జరిగిన ఈ ఉదంతాన్ని తన సోషల్ మీడియా మాధ్యమం పేస్ బుక్ లో ఫొటోలతో సహా పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది…..

  •  
  •  
  •  
  •  

Comments