ఏటీఎం క్యూ లో పంది పిల్లతో డైరెక్టర్..!

Wednesday, November 23rd, 2016, 10:14:09 PM IST

ravi-babu
విభిన్న చిత్రాలని తెరకెక్కించే దర్శకుడు, నటుడు అయిన రవిబాబుకి కూడా కరెన్సీ కష్టాలు తప్పలేదు. దేశవ్యాప్తంగా పెద్ద నోటా రద్దుతో ప్రజలు బ్యాంకుల ముందు ఏటీఎం ల ముందు పడిగాపులు కాస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ రవిబాబు కూడా ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి క్యూ లో నిలుచున్నాడు. సామాన్యుల నుంచి బడా బాబుల వరకు అందరిని కకరెన్సీ కష్టాలు చుట్టుముట్టడంతో రవిబాబు ఏటీఎం క్యూలో నిలుచోవడం పెద్ద వింత కాకపోవచ్చు. అతనితో పాటు క్యూ లో తన చంకలో పంది పిల్లని మోస్తూ దర్శనమిచ్చాడు.

దీనికి కారణం లేకపోలేదు. తన దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘అదిగో’ చిత్ర ప్రచారం లో భాగంగానే రవిబాబు పంది పిల్లని తీసుకుని వచ్చాడని అంటున్నారు.ఈ చిత్రం లో పందిపిల్ల ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తుందట. దానికోసం రవిబాబు ఆ పంది పిల్లని పెంచుతున్నాడట. అటు తన చిత్రానికి ప్రచారాన్ని చేసుకున్నాడు ఇటు ఏటీఎం లో డబ్బులు డ్రాచేసుకున్నాడు ..రవిబాబుకి ఇది రెండువిధాలా కలిసొచ్చిందన్న మాట. కాగా ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణని పూర్తి చేసుకుందట. త్వరలోనే విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు.