చికాగో సెక్స్ రాకెట్ : నేమ్ లీక్ అవ్వడంతో కాపాడమంటున్న హీరోయిన్

Wednesday, June 27th, 2018, 03:27:41 PM IST

గత ఏడాది డ్రగ్స్ వివాదం టాలీవుడ్ ని ఎలా ఇబ్బందులకు నెట్టేసిందో ఇప్పుడు చికాగో సెక్స్ రాకెట్ కూడా అదే స్థాయిలో దెబ్బ కొట్టింది. నేషనల్ మీడియా ఇష్టం ఉన్నట్లుగా టాలీవుడ్ సెక్స్ రాకెట్ అంటూ ట్యాగ్ లైన్స్ ఇచ్చేస్తోంది. కొందరు చేసిన తప్పుకు ఇప్పుడు అందరికి ఆ గాలి తగులుతోంది. ఇది ఎంతవరకు కరెక్టో గాని ఈ వివాదాల గురించి టాలీవుడ్ పెద్దలు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఇకపోతే చికాగో సెక్స్ రాకెట్ లో ఇరుక్కున్న ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి.

అయితే ఈ వివాదం నుంచి కాపాడమని ఆ లేడి టాలీవుడ్ లోని ఒక బడా నిర్మాతను ప్రార్దించినట్లు తెలుస్తోంది. ఈ బడా నిర్మాత తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి ఘటనలు జరిగినా చాలా ఈజీగా సెటిల్ చేస్తారని తెర వెనుక చేసిన సెటిల్మెంట్ లిస్ట్ చాలా పెద్దగా ఉందని కామెంట్స్ చేశారు. ఇకపోతే చికాగో సెక్స్ రాకెట్ లో ఇరుక్కున్న ఒక బ్యూటీ కూడా ఆ బడా నిర్మాతను వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆ హీరోయిన్ నాలుగు సినిమాలు చేసింది. ఓ కమెడియన్ తో గత ఏడాది సినిమా చేసి డిజాస్టర్ అందుకుంది. ప్రస్తుతం పోటోషూట్స్ చేసుకుంటు ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఊహించని విధంగా సెక్స్ రాకెట్ లో నేమ్ లీక్ అయ్యింది. మరి ఆ బడా నిర్మాత ఆ హీరోయిన్ ను కాపాడతాడో లేదో చూడాలి.