హోదాకు ఈ హీరోల మద్దత్తు మాత్రమే సరిపోతుందా ?

Wednesday, January 25th, 2017, 10:05:26 AM IST

heros
రిప‌బ్లిక్‌డే రోజున (26న) విశాఖ‌ప‌ట్నం బీచ్‌లో తెలుగు యువ‌త క‌దం తొక్క‌నుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ముందుండి యువ‌త‌రాన్ని న‌డిపించ‌నున్నారు. ఓ వైపు ట్విట్ట‌ర్‌లో త‌న ఉనికిని తెలియ‌జేస్తూ .. ప‌వ‌న్ దూసుకుపోతున్నారు. జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తితో `ప్ర‌త్యేక‌హోదా` సాధ‌న కోసం ఏపీ యువ‌తలో మౌన పోరాట స్ఫూర్తిని ర‌గిలించిన నేత‌గా ప‌వ‌న్ ఇప్ప‌టికే పాపుల‌ర్ అయిపోయారు. ఇప్పుడు యువ‌త‌రం హీరోలు మేము సైతం అంటూ బ‌రిలోకి దూసుకొస్తున్నారు.

విశాఖ బీచ్‌లో మౌన పోరాటానికి యువ‌హీరోలంతా ట్వీట్ల సాక్షిగా మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. వ హీరోల్లో వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్‌, నిఖిల్‌, నాని, శివ‌బాలాజీ, సందీప్ కిష‌న్ ఉన్నారు. అలాగే విశాఖ బీచ్‌లో సాగే పోరాటానికి నేను సైతం అంటూ తెలంగాణ హీరో సంపూర్ణేష్ బాబు మ‌ద్ద‌తివ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. మునుముందు టాలీవుడ్ యావ‌త్తూ ఈ మౌన పోరాటానికి ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.