‘హుధూద్’ బాధితులకోసం టాలీవుడ్ “మేము సైతం”

Wednesday, October 29th, 2014, 12:29:27 PM IST

TFI
అక్టోబర్ 12న వైజాగ్ ను హుధూద్ తుఫాన్ గడగడలాడించిన విషయం తెలిసిందే. పచ్చని విశాఖనగరం తుఫాన్ ధాటికి ఎడారిగా మారిపోయింది. అయితే.. ఇప్పుడు హుధూద్ బాధితులను ఆదుకునేందుకు.. టాలీవుడ్ ముందుకు వచ్చింది. విశాఖ వాసులకోసం నవంబర్ 9న ప్రత్యేక ప్రొగ్రామ్ ను ఏర్పాటు చేసింది. తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఈ మేముసైతం కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు తెలుస్తున్నది. మొత్తం 13గంటలపాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలుగు పరిశ్రమ హీరోలు.. దర్శకులు జట్టులుగా ఏర్పడి మేముసైతం కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తున్నది. అంతేకాకుండా.. తమిళ హీరోలైన కార్తీ.. సూర్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తున్నది.