వైరల్ పిక్ : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తే..

Tuesday, June 5th, 2018, 08:24:18 PM IST

టాలీవుడ్ దర్శకులు అంతా ఒక చోట కలవడం అంటే చాలా స్పెషల్ అని చెప్పాలి. సినిమా వేడుకలు ఇతర ఫంక్షన్స్ ఉంటే గాని పెద్దగా కలుసుకోరు అని అంతా అనుకుంటారు. కానీ నేటితరం దర్శకులు సిట్టింగ్ లు వేయడం చాలా కామన్. అయితే ఆ విషయం ఎక్కువగా బయటకు తెలియదు. సోషల్ మీడియా ప్రభావం వల్ల దర్శకులు ఈ రోజుల్లో ఆనంద క్షణాలను హ్యాపీగా అభిమానులతో పంచుకుంటున్నారు.

రీసెంట్ గా వంశీ పైడిపల్లి పోస్ట్ చేసిన ఒక ఫొటో వైరల్ అవుతోంది. రాజమౌళి, సుకుమార్‌, క్రిష్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌ల అలాగే అనిల్‌ రావిపూడి, నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ వంగ, వంశీ పైడిపల్లి ఒకటే ఫ్రెమ్ లో కనిపించడంతో నెటిజన్స్ లెజెండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి తన ఇంట్లో ఇలా సరదాగా అందరిని ఒక చోటికి చేర్చాడు. మరచిపోలేని సమయాన్ని గడిపినట్లు అందరికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments