టాలీవుడ్ ట్రెండింగ్ టాపిక్.. శ్రీనువైట్ల చాప్ట‌ర్ క్లోజ్..?

Monday, November 19th, 2018, 12:35:42 PM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేచుర‌ల్ స్టార్ నానిల‌కు సంబంధించిన ఒక వార్త సినీ వ‌ర్గ‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. గ‌త కొంత‌కాలంగా వ‌రుస‌గా ప్లాప్‌లు ఇస్తూ వ‌చ్చిన డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల నుండి తాజాగా వ‌చ్చిన చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని. ర‌వితేజ‌- ఇలియానా హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం గ‌త శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శ్రీను-ర‌విల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన గ‌త చిత్రాలు మంచి హిట్లు అవ‌డంతో ఈ చిత్రం పై కూడా ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే తొలిషో నుండే ఈ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

టీజ‌ర్ ట్రైల‌ర్ల‌తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్‌కి ర‌ప్పించింది. అయితే తెర పై బొమ్మ ప‌డ్డాక ప్రేక్ష‌కులు అయోమ‌యంతో త‌ల‌లు ప‌ట్టుకున్నారు. వ‌రెస్ట్ స్క్రీన్‌ప్లే, వీక్ డైరెక్ష‌న్‌తో రొటీన్ రివేంజ్ స్టోరీగా మ‌లిచాడు శ్రీనువైట్లు. దీంతో ప్ర‌మోష‌న్ల‌లో ఇచ్చిన బిల్డ‌ప్ చూసి మ‌రోసారి భంగ‌ప‌డిన ప్రేక్ష‌కులు వెంట‌నే ప్లాప్ అని తేల్చేశారు. ఇక సోష‌ల్ మీడియా వేదికల పై శ్రీను వైట్ల పై విరుచుకు ప‌డ్డారు సినీ అభిమానులు. ఇక ఆగ‌డు, బ్రూస్లీ, మిస్ట‌ర్ లాంటి వ‌రుస డిజాస్ట‌ర్లు ఇచ్చిన త‌ర్వాత కూడా రవితేజ‌- మైత్రీ మూవీస్ మేక‌ర్ క‌లిసి మంచి అవకాశం ఇస్తే.. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని లాంటి క‌న్ఫ్యూజింగ్ మూవీని తెర‌కెక్కంచి మ‌రో డిజాస్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసున్నాడ‌ని.. వ‌రుస ప్లాపులు ఇచ్చిన త‌ర్వాత కూడా త‌న‌కు వ‌చ్చిన మంచి అవ‌కాశాన్ని చేజేతులారా కాజేసుకున్నాడ‌ని.. దీంతో శ్రీను వైట్ల చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్టేన‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.