టాప్ సీక్రెట్‌ : మ‌లేషియా పీఎంతో ర‌జ‌నీ భేటీ వెన‌క‌?

Sunday, January 7th, 2018, 03:50:37 AM IST

ద‌శాబ్ధాలుగా త‌న‌దైన ఛ‌రిష్మాతో సినీవినీలాకాశంలో తిరుగులేని హ‌వా చాటుతున్న సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. దేశ విదేశాల్లో సాక్షాత్తూ ప్ర‌ధానులే దిగొస్తారు ఆయ‌న్ని చూస్తే. అంతెందుకు 120 కోట్ల జ‌నాభా ఉన్న భార‌త‌దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆయ‌న ముందు మోక‌రిల్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ద‌క్షిణాదిన .. అందునా త‌మిళ‌నాడులో పాగా వేస్తే ఇక భాజ‌పా కంచుకోట‌ను ఎవ్వ‌రూ ట‌చ్ చేయ‌లేర‌న్న‌ది ప్ర‌ధాని మోదీ ఉవాచ‌. అందుకే సాక్షాత్తూ ర‌జ‌నీకాంత్‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రిని చేసేందుకు కావాల్సిన బ‌ల‌గాల్ని ఇస్తాన‌ని ప్ర‌ధాని స్వ‌యంగా మొర‌పెట్టుకున్నారు. అయినా ర‌జ‌నీ స‌సేమిరా అని తిప్పి పంపారే కానీ, త‌న‌కు ఇత‌రుల అండ‌దండ‌లు అవ‌స‌రం లేద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. అంతేకాదు తానే ఓ కొత్త పార్టీ పెట్టి గెలుపు అంటే ఏంటో చూపిస్తాన‌ని, రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల‌కు పోటీ చేస్తాన‌ని ర‌జ‌నీ స‌వాల్ విసిరారు.

అదంతా అటుంచితే ర‌జ‌నీకి కేవ‌లం మ‌న దేశ ప్ర‌ధాని మాత్ర‌మే కాదు.. ఏకంగా ప్ర‌పంచ చిత్ర‌ప‌టంలో అత్యంత ఖ‌రీదైన దేశంగా విరాజిల్లుతున్న మ‌లేషియా దేశ ప్ర‌ధాని ర‌జ‌నీ అంటే ఎంతో ఇదైపోవ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌కొచ్చింది. కౌలాలంపూర్‌లో న‌డిగ‌ర సంఘం `స్టార్‌నైట్‌` పేరుతో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి ర‌జ‌నీకాంత్ ఎటెండ్ అయ్యారు. ఆ సంద‌ర్భంగా మ‌లేషియా ప్ర‌ధాని మొహ‌మ్మ‌ద్ న‌జీబ్‌ ర‌జాక్ స్వ‌యంగా ర‌జ‌నీని ఆహ్వానించి ఆనందాన్ని పంచుకున్నారు. ర‌జ‌నీతో ఎంతో విలువైన స‌మ‌యాన్ని గ‌డిపారు. మంత‌నాలు సాగించారు. “త‌లైవాని క‌లుసుకోవ‌డం ఎంతో గ్రేట్ ఛాన్స్‌.. మ‌లేషియాలో ఇలా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీతోనే క‌లిసే అవ‌కాశం గ్రేట్‌“ అంటూ ట్వీట్ చేశారు న‌జీబ్ ర‌జాక్‌. మీ స‌మ‌యాన్ని ఇక్క‌డ ఎంజాయ్ చేయండి.. అంటూ ర‌జ‌నీని సాద‌రంగా ఆహ్వానించారు. అయితే మ‌లేసియాలో మెజారిటీ పార్ట్‌గా ఉన్న త‌మిళుల ఓట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంటే అది త‌న‌కు రాజ‌కీయంగా ఎంతో క‌లిసొస్తుంద‌ని, అందుకు ర‌జ‌నీతో ప్రాప‌క‌మే ఉప‌యుక్త‌మ‌ని న‌జీబ్ భావించి ఉండొచ్చ‌ని చెబుతున్నారు. ఇక‌పోతే స్వ‌త‌హాగానే ర‌జ‌నీకాంత్ సినిమాల‌కు మ‌లేషియాలో విశేష ఆద‌ర‌ణ ఉంటుంది. సొంత రాష్ట్రంలో సాధించినంత భారీ క‌లెక్ష‌న్స్ మ‌లేషియాలోనే వ‌సూలు చేస్తారు ర‌జ‌నీ. ల‌క్ష‌లాది ఓటు బ్యాంక్ మ‌లేషియాలో ఉంది. ఇక త‌మిళ‌నాడులో ర‌జ‌నీకాంత్ సొంతంగా పోటీ చేస్తే మ‌లేషియా ప్ర‌ధాని ఆర్థిక సాయం ఉండే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.