ప్రీమియర్ షో టాక్ : టచ్ చేసి చూడు

Friday, February 2nd, 2018, 11:23:36 AM IST

రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ టచ్ చేసి చూడు చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ సినిమాల్లో ప్రధానంగా యాక్షన్ కామెడీ అంశాలు హైలైట్ గా నిలుస్తాయి. టచ్ చేసి చూడు చిత్రంలో కూడా అలాంటి అంశాలే ఉన్నట్లు ప్రచార చిత్రాల ద్వారా అర్థమైంది. రవితేజ తనకు అచొచ్చిన పోలీస్ అధికారి పాత్రనే ఈ చిత్రంలో కూడా పోషించాడు. రాశి ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లు గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం యుఎస్ లో ప్రీమియర్ షోల రూపంలో ప్రదర్శించబడింది. తొలిసారి దర్శకత్వం వహించిన విక్రమ్ సిరికొండ టచ్ చేసి చూడు చిత్రాన్ని ఆకట్టుకునే విధంగా మలిచాడా లేదా.. ఇప్పుడు చూద్దాం..!

రవితేజ లాంటి నటుడు ఉంటె డైరెక్టర్ కి సగం బలం ఉన్నట్లే. ఎందుకంటే నటన పరంగా ఎలాంటి మైనస్ లు కనిపించవు. ఫస్ట్ హాఫ్ లో అసలు కథ నెమ్మదిగా మొదలువుతుంది. ఇంటర్వల్ సన్నివేశంతో సెకండ్ హాఫ్ పై ఆశలు పెరుగుతాయి. ఎందుకంటే అప్పటివరకు ఫస్ట్ హాఫ్ లో హైలైట్ అయిన అంశం మరొకటి లేదు. చూడడానికి యాక్షన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తున్నా.. రవితేజ మార్క్ యాక్షన్ ని, కామెడీని దర్శకుడు అదుపు తప్పించేశాడు. హీరోయిన్లతో కొన్ని రొమాంటిక్, ఫన్నీ సీన్స్ ఆకట్టుకుంటాయి. కథ పరంగా బలం లేకపోవడంతో సెకండ్ హాఫ్ కూడా పెద్దగా అనిపించదు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్ర్రం పరవాలేదనిపిస్తాయి. మొత్తంగా రవితేజ కెరీర్ లో టచ్ చేసి చూడు అనే చిత్రం సాదా సీదా యావరేజ్ చిత్రంగా మిగిలిపోనుంది.