తెలంగాణలో కారుకు ఎదురుగాలి

Saturday, October 27th, 2018, 10:58:56 PM IST

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే, కెసిఆర్ ముందస్తుకు వెళ్లినట్టుగానే అభ్యర్థులను ప్రకటించటం లో దూకుడు ప్రదర్శించి ఐదారు స్థానాల్లో మినహాయించి అన్ని స్థానాల్లో సిట్టింగులకే అవకాశం ఇచ్చి తన ప్రత్యేకత చాటుకున్నాడు. కాగా,కెసిఆర్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏర్పడ్డ మహాకూటమి అభ్యర్థుల ప్రకటన విషయం లో ఇంకా తర్జన భర్జనలు పడుతోంది.

ఎన్నికల గడువు దగ్గరపడుతున్న తరుణం లో తెరాస తరపున పోటీ చేయనున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసారు, ఈ నేపథ్యం లో ప్రజలు “అపుడెపుడో 2014 లో కనపడ్డ మీరు గెలిచిన తరువాత మమ్మల్ని ఏనాడైనా పట్టించుకున్నారా?, ఇపుడు మల్లీ ఓట్లు అడగటం కోసం ఎలా వస్తారు” అని ప్రశ్నించి వారికి అనుకోని షాక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఒకరిద్దరికి మినహాయించి అందరికి అనుకూలంగానే ఉందని వచ్చిన రిపోర్ట్ ఆధారంగా పరిస్థితి తమకు అనుకూలంగా ఉన్నట్టు భావించి కెసిఆర్ ముందస్తుకు వెళ్లారు. తీరా అభ్యర్థుల ప్రకటన తరువాత పరిస్థితి చుస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ ,కరీంనగర్ వంటి నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ దారుణంగా తెరాస అభ్యర్థులు కనీసం తిరగలేని పరిస్థితి ఉందని అంటున్నారు. మరోవైపు మహాకూటమి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది, ఇపుడే ఇలా ఉంటే మహాకూటమి అభ్యర్థుల ప్రకటన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో అని తెరాస శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.

  •  
  •  
  •  
  •  

Comments